కస్టమర్లకు బ్యాడ్‌ న్యూస్‌..స్విగ్గీకి భారీ షాక్‌ ఇచ్చిన 900 రెస్టారెంట్లు

28 Oct, 2022 19:07 IST|Sakshi

ప్రముఖ ఫుడ్‌ ఆగ్రిగ్రేటర్స్‌, రెస్టారెంట్ల మధ్య ఒప్పొందాలు విఫలమయ్యాయి. దీంతో స్విగ్గీకి చెందిన ఫ్రీ టేబుల్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘డైన్‌అవుట్‌’ నుంచి 900 రెస్టారెంట్లు వైదొలిగాయి. 

కోవిడ్‌ -19 తర్వాత రెస్టారెంట్‌లు పుంజుకోవడంతో ఫుడ్‌ ఆగ్రిగ్రేటర్స్‌ కస్టమర్లను ఆకట్టుకునేందుకు భారీ ఎత్తు ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. దీంతో తమకొచ్చే ఆదాయం తగ్గిపోతుందటూ రెస్టారెంట్‌ యజమానులు చెబుతున్నారు. వాటికి పరిష్కార మార్గంగా రెస్టారెంట్‌ బాడీ నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) సంస్థ .. జొమాటో, స్విగ్గీలాంటి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలతో చర్చలు జరిపింది.  

చదవండి👉 ఫ్రీగా పిజ్జాలు..జొమాటో, స్విగ్గీలకు డొమినోస్‌ గుడ్‌బై?

ఈ చర్చల సందర్భంగా ఎన్‌ఆర్‌ఏఐ ప్రతినిధులు మాట్లాడుతూ.. ‘ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ కస్టమర్లకు భారీ ఎత్తున డిస్కౌంట్‌లు, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌లను అందిస్తున్నాయి. దీంతో వారు మా రెస్టారెంట్‌లో ఏదైనా ఫుడ్‌ తిన్న తర్వాత డైన్‌ అవుట్ లేదా జొమాటో పే వంటి యాప్‌ల ద్వారా చెల్లింపులు జరుపుతున్నారు. ఆ చెల్లింపు సమయంలో మేం(రెస్టారెంట్‌లు) కూడా డిస్కౌంట్‌లు ఇవ్వాల్సి వస్తుంది.

తద్వారా మా కొచ్చే ఆదాయం భారీగా పడిపోతుంది. 2ఏళ్ల పాటు రెస్టారెంట్లపై విధించిన ఆంక్షలు ఎత్తివేయడం, తిరిగి కస్టమర్లకు రెస్టారెంట్లకు రావడంతో వ్యాపారం పుంజుకుంది. నష్టాల నుంచి గట్టెక్కే ప్రయత్నంలో  ఇలాంటి ఆఫర్లను దీర్ఘకాలికంగా కొనసాగించడం కష్టమే’నని చెప్పారు. 

చదవండి👉 శబాష్!! జొమాటో.. చెప్పింది చేసింది!

నెల గడువు తర్వాత 
సెప్టెంబరులో విడుదల చేసిన ఎన్‌ఆర్‌ఏఐ నోటిఫికేషన్‌లో..ఆఫర్‌లు దీర్ఘకాలంలో మొత్తం రెస్టారెంట్ ఇండస్ట్రీపై ప్రభావాన్ని చూపుతాయి. జొమాటో.. జొమాటో పే, స్విగ్గీ..స్విగ్గీ డిన్‌అవుట్‌ పేరుతో పేమెంట్‌ గేట్‌వేలను అందుబాటులోకి తెచ్చాయి. ఇది మా కస్టమర్‌లకు డిస్కౌంట్లు ఇవ్వడం, 100% క్యాష్ బ్యాక్‌లు, బ్యాంక్ ఆఫర్‌లను అందించడం పేమెంట్‌ గేట్‌వేలను వినియోగించేలా ప్రోత్సహిస్తుంది.

కానీ అలాంటి నిరాధారమైన ఆఫర్లు ఇస్తే..తాము ఫుడ్‌ ఆగ్రి గ్రేటర్‌లతో పెట్టుకున్న ఒప్పొందాన్ని రద్దు చేసుకుంటామని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది. సరిగ్గా నెల రోజుల తర్వాత ఫుడ్‌ ఆగ్రిగ్రేటర్‌లతో జరిపిన చర్చలు సఫలం కావడంతో రెస్టారెంట్‌ల బాడీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. 

చదవండి👉 రెస్టారెంట్లపై కేంద్రం ఆగ్రహం,సర్వీస్‌ చార్జీ వసూలు చేయుడు బంజేయండి!

మరిన్ని వార్తలు