ఆధార్‌ కార్డ్‌లో మీ వివరాలు అప్‌డేట్‌ చేయాలా? ఇలా సింపుల్‌గా చేయండి!

26 Jan, 2023 15:01 IST|Sakshi

ఆధార్‌ కార్డ్‌(Aadhaar Card).. ప్రస్తుతం ఈ పేరు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆధార్‌ అనేది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాకుండా సంక్షేమ పథకాలు విషయంలో, ఆర్థిక వ్యవహరాల్లో కీలకంగా మారింది. దీంతో కొందరు ఆధార్‌ కార్డ్‌ని దుర్వినియోగం చేయడం మొదలుపెట్టారు.ఈ క్రమంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) సంస్థ ఈ కార్డ్‌ విషయంలో అక్రమాలను అరికట్టేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల 10 ఏళ్లకోసారి ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయాలన్న వార్తలు బలంగానే వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆధార్ కార్డ్ వివరాలను అప్‌డేట్ చేయడం తప్పనిసరి కాకపోయినా, చేయడం వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి. 

ఇటీవల ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ స్కీం లాంటి ప్రభుత్వ పథకాలతో పాటు ప్రభుత్వ అందిస్తున్న సేవలకు ఆధార్ నెంబర్ తప్పనిసరిగా మారింది. ఇక ఆర్థిక వ్యవహారాల్లోనూ ఆధార్‌ నెంబర్‌ కీలక పాత్ర పోషిస్తోంది.ఈ తరుణంలో ఆధార్ కార్డ్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం లబ్ధిదారులకు చాలా ముఖ్యమనే విషయాన్ని గమనించాలి. 

కేవలం అప్‌డేట్‌తో పాటు అందులో తప్పులు ఉంటే మార్చుకోవాలి. కార్డులోని పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్ చేసుకునే వెసలుబాటు ఉంది. వీటిని అప్‌డేట్ చేయడానికి ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. మరి ఆన్‌లైన్‌లో ఈ వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు. 

పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఆప్షన్స్‌లో మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. మీ వివరాలు అప్‌డేట్ చేసి అందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. అనంతరం ఈ సేవకు అవసరమయ్యే పేమెంట్ చేసి ప్రాసెస్ పూర్తి చేయాలి. ఎంఆధార్ యాప్ ఉన్నవాళ్లు ఆధార్ అప్‌డేట్ కోసం ఇవే స్టెప్స్ ఫాలో కావచ్చు. పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి వివరాలు కాకుండా మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, రిలేషన్‌షిప్ స్టేటస్, ఐరిస్, ఫింగర్‌ప్రింట్, ఫోటో అప్‌డేట్ చేయాలంటే తప్పనిసరిగా ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

అప్‌డేట్‌ ఇలా చేసుకోండి
- ఆధార్ SUP పోర్టల్ uidai.gov.inని సందర్శించండి, ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చిరునామాను ఎంచుకోండి
- మీ ఆధార్ నంబర్ లేదా VIDని నమోదు చేయండి
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపే సెక్యూరిటీ కోడ్ OTP వస్తుంది 
- మీరు అందుకున్న OTPని నమోదు చేయండి
- "చిరునామా" ఎంపికను ఎంచుకుని, సబ్మిట్‌ చేయండి
- మీ అన్ని అడ్రస్ వివరాలను జాగ్రత్తగా నమోదు చేసి, సబ్మిట్ బటన్‌ను నొక్కి, ఆపై చివరగా నిర్ధారించుకోండి
- సపోర్టింగ్ డాక్యుమెంట్ రంగు స్కాన్ చేసిన కాపీని అటాచ్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి
- పత్రం సరైనదని నిర్ధారించుకోండి. అన్నీ సరైనవే అయితే ఎస్‌ బటన్‌ ఎంచుకోండి
- BPOని ఎంచుకుని, సబ్మిట్‌పై క్లిక్ చేయండి
-  మీ అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ ఇప్పుడు సబ్మిట్‌ చేయండి
- అనంతరం మీ URN నంబర్‌ మీ రిజిస్టర్‌ మొబైల్ నంబర్‌తో పాటు మీ ఈమెయిల్‌కి కూడా వస్తుంది.
- మీరు మీ URN స్థితిని ఆన్‌లైన్‌లో కూడా తనిఖీ చేయవచ్చు

మరిన్ని వార్తలు