అలర్ట్‌: ఆధార్ కార్డ్ వినియోగంపై కీలక మా​ర్గదర్శకాలు విడుదల!

31 Dec, 2022 16:31 IST|Sakshi

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వాటి వల్ల మంచితో పాటు చెడు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటీవల వ్యక్తిగత వివరాలు( మొబైల్‌ నంబర్‌, ఆధార్‌, బ్యాంక్‌ అకౌంట్‌ , డెబిట్‌ కార్డ్‌, పిన్‌ నంబర్‌) తెలుసుకుని సైబర్‌ నేరగాళ్లు మన జేబులకు చిల్లు పెడుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సమస్యపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాయి. తాజాగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) కొత్త సంవత్సరం రానున్న సందర్భంగా ఆధార్‌ వినియోగంపై కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఆధార్‌ వినియోగం ఎలా అంటే..
ఇటీవల ఆధార్‌ కేవలం గుర్తింపు కార్డ్‌లానే కాకుండా పలు సంక్షేమ పథకాలు, బ్యాంక్‌, పాన్‌ వంటి వాటితో జత చేయడంతో చాలా క్రీయాశీలకంగా మారింది. దీంతో సైబర్‌ కేటుగాళ్ల క‍ళ్లు ఆధార్‌ నెంబర్‌పై పడింది.

ఈ నేపథ్యంలో .. మోసాల బారిన పడకుండా యూఐడీఏఐ పలు సూచనలు చేసింది. ఇంత వరకు బ్యాంక్ ఖాతా నంబర్లు, పాన్, పాస్‌పోర్ట్‌లతో సహా ఇతర డ్యాకుమెంట్లు మాదిరిగానే ప్రజలు ఆధార్‌ విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. సోషల్ మీడియాతో పాటు ఇతర ప్లాట్‌ఫాంలతో సహా పబ్లిక్ డొమైన్‌లో ఆధార్ కార్డ్‌లను ఎప్పుడూ షేర్ చేయవద్దని సూచించింది.

ఏ పరిస్థితిల్లోనూ ఇతరులతో ఆధార్ ఓటీపీ (OTP)ని పంచుకోకూడదని తెలిపింది. ఒక వేళ ఏదైనా విశ్వసనీయ సంస్థతో ఆధార్‌ను పంచుకునేటప్పుడు, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ లేదా పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి, పాన్, రేషన్ కార్డ్ వంటి ఏదైనా ఇతర గుర్తింపు పత్రాన్ని పంచుకునే సమయంలో అదే స్థాయి జాగ్రత్తలు పాటించాలని UIDAI సూచనలు చేసింది.

చదవండి: న్యూ ఇయర్‌ ఆఫర్‌: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,000 తగ్గింపు.. త్వరపడాలి, అప్పటివరకే!

మరిన్ని వార్తలు