Aadhaar: ఆధార్ కార్డు యూజర్లకు అలర్ట్.. ఇక ఈ ఆధార్ కార్డులు చెల్లవు?

20 Jan, 2022 10:51 IST|Sakshi

ఆధార్ కార్డు వినియోగదారులకు యుఐడీఏఐ భారీ షాక్ ఇచ్చింది. భద్రత రక్షణలు లేకపోవడం వల్ల బహిరంగ మార్కెట్లో తయారు చేస్తున్న పీవీసీ ఆధార్ కాపీలను ఉపయోగించడాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఏఐ) నిషేదించింది. బయటి మార్కెట్లో తయారు చేస్తున్న నకిలీ పీవీసీ కార్డులను ఉపయోగించడం మంచిది కాదని పేర్కొంది. అలాంటి పీవీసీ కార్డ్‌లు ఎలాంటి సెక్యూరిటీ లేదా సెక్యూరిటీ ఫీచర్‌లను కలిగి ఉండవని తెలిపింది. 

కాబట్టి మీరు ప్రింటెడ్ పీవీసీ ఆధార్ కార్డ్‌ని తీసుకోకండి. అలాగే, పీవీసీ ఆధార్ కార్డు కావాలంటే రూ.50 చెల్లించి ప్రభుత్వ ఆధార్ ఏజెన్సీ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చని యూఐడీఏఐ ట్వీట్‌లో పేర్కొంది. ఆర్డర్ కోసం ఒక లింక్ కూడా యుఐడీఏఐ ట్విటర్ వేదికగా షేర్ చేసింది. 

ఆధార్ పీవీసీ కార్డు అంటే ఏమిటి? 
పీవీసీ ఆధారిత ఆధార్ కార్డు అనేక భద్రతలతో కూడిన ఫోటోగ్రాఫ్, డెమోగ్రాఫిక్ వివరాలతో డిజిటల్‌గా సంతకం చేసిన సురక్షిత క్యూఆర్ కోడ్ కలిగి ఉంటుంది. ఈ కార్డు ఏటీఎం కార్డు పరిమాణంలో ఉంటుంది. దీనిన్ నీటిలో వేసిన కూడా తడవదు. ఆధార్ పీవీసీ కార్డును మీరు పేర్కొన్న చిరునామాకు ఫాస్ట్ పోస్ట్ ద్వారా సరఫరా చేస్తుంది.

పీవీసీ ఆధార్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

  • యూఐడీఏఐ వెబ్​సైట్​(https://myaadhaar.uidai.gov.in/) ఓపెన్ చేసి అందులో లాగిన్ అవ్వండి
  • 'ఆర్డర్​ ది పీవీసీ కార్డ్'పై క్లిక్ చేయాలి.
  • అక్కడ మీకు మీ వివరాలు కనిపిస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. 
  • ఆ తర్వాత రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. 
  • ఆధార్​ కార్డులో ఉన్న అడ్రెస్​కు పీవీసీ కార్డు వచ్చేస్తుంది.

(చదవండి: అయ్యో పాపం! రెండేళ్ల బాలుడికి ప్రపంచంలోనే అరుదైన వ్యాది) 

మరిన్ని వార్తలు