ఆధార్‌ అప్‌డేట్‌ చేయాలనుకుంటున్నారా? ఇవి తెలుసుకుంటే ఈజీ!

17 Mar, 2023 17:49 IST|Sakshi

దేశంలో ఆధార్ కార్డ్ ప్రతిఒక్కరికీ చాలా ముఖ్యమైన డాక్యుమెంట్‌. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) దీన్ని జారీ చేస్తుంది. గుర్తింపు పత్రంగా ప్రముఖంగా దీన్ని వినియోగిస్తుంటారు. వివిధ పథకాలకు కూడా ప్రభుత్వం ఆధార్‌ కార్డును తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో ఆధార్‌ కార్డులో దొర్లిన తప్పులు, లేదా మార్పుల కోసం చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు.

ఇదీ చదవండి: ట్యాక్స్‌ ప్లానింగ్‌లో చేసే పొరపాట్లు ఇవే.. తెలుసుకుంటే పన్ను ఆదా పక్కా!

ఇలాంటి తప్పులను సరి చేసుకునేందుకు, చిరునామాల్లో మార్పులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో అవకాశం కల్పించింది. కొన్నింటిని మొబైల్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. మరికొన్నింటికి మాత్రం ఆధార్‌ సీఎస్‌సీ కేంద్రాన్ని సందర్శించి ఆఫ్‌లైన్‌లో చేయించుకోవాలి.

ఆన్‌లైన్‌లో చేసుకునే అప్‌డేట్‌లు
ఆధార్‌ కార్డులో పేరు, పుట్టిన తేదీ, చిరునామా, జెండర్‌  వంటి వివరాలను ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్‌ చేసుకోవచ్చు. మొబైల్‌ లేదా ఏదైనా ఆన్‌లైన్‌ సెంటర్లలో వీటిని చేసుకోవచ్చు. అయితే వీటికి సంబంధించిన డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే పోస్టల్ వెబ్‌సైట్ ద్వారా అయితే మొబైల్ నంబర్‌లను కూడా మార్చుకునే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌.. ఇక అన్‌లిమిటెడ్‌ 5జీ డేటా!

తప్పనిసరిగా ఆఫ్‌లైన్‌లో చేసుకునేవి
ఆధార్‌కార్డ్‌లో బయోమెట్రిక్ డేటా, మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను అప్‌డేట్ చేయడానికి తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాలి. ఇందు కోసం ముందుగా యూఐడీఏఐ వెబ్‌సైట్ ద్వారా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. బయోమెట్రిక్ డేటా, మొబైల్ నంబర్‌, ఈమెయిల్ ఐడీల అప్‌డేట్‌ కోసం ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు. మొబైల్ నంబర్‌లు, బయోమెట్రిక్ డేటా, ఆధార్ కార్డ్‌లోని ఫోటోలు వంటి మార్పులకు రుసుము రూ. 30 నుంచి రూ. 100 వరకు ఉంటుంది.

ఇదీ చదవండి: SVB: దివాలా తీసిన బ్యాంకులో మనోళ్ల డిపాజిట్లు ఎంతంటే..

మరిన్ని వార్తలు