భారత్‌లో డెలాయిట్‌ ఏఐ ఇనిస్టిట్యూట్‌.. ఏఐ ఇంజినీర్లదే భవిష్యత్తు!

7 Dec, 2021 14:00 IST|Sakshi

అర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌.. ఇప్పుడు ఈ సాంకేతికత హవా నడుస్తోంది. అంతేకాదు రాబోయే రోజుల్లో శాసించే టెక్‌ ట్రెండ్‌ కూడా ఇదే. ఈ మేరకు ఏఐపై పట్టుకోసం యువత తీవ్రంగా యత్నిస్తోంది. ఇదిలా ఉంటే భారత్‌లో ఇదివరకే కొన్ని విద్యాలయాలు, ప్రైవేట్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఏఐ టెక్నాలజీ కోర్సులను అందిస్తుండగా.. తాజాగా డెలాయిట్‌ కూడా ఇందులోకి దిగింది. 


ఫైనాన్షియల్‌ కన్సల్టెన్సీ కంపెనీ డెలాయిట్‌.. పూర్తి స్థాయి ఏఐ ఆవిష్కరణల కోసం ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించుకుంది. ఏఐ సాంకేతికతపై ప్రాథమిక అవగాహన, ప్రతిభాపాటవాల ఆధారంగా ఎంపిక చేయబడ్డ వాళ్లకే ఈ ఇనిస్టిట్యూట్‌లో అడ్మిషన్లు దొరుకుతాయని డెలాయిట్‌ ఇండియా భాగస్వామి సౌరభ్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 

ఇదిలా ఉంటే అమెరికాలో కిందటి ఏడాది డెలాయిట్‌ ఫస్ట్‌ ఏఐ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత కెనెడా, ఇంగ్లండ్‌, జర్మనీ, చైనా, ఆస్ట్రేలియాల్లో అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇనిస్టిట్యూట్‌లను నెలకొల్పింది. 

ఏఐ ఇంజినీర్లు కావలెను

ఎంఎన్‌సీ మొదలు.. చిన్నస్థాయి కంపెనీల దాకా(అందుబాటులో బడ్జెట్‌తో) ఏఐ మీదే ఆధారపడుతున్నాయి ఇప్పుడు. ఈ తరుణంలో ప్రజెంట్‌-అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీగా అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను పేర్కొంటున్నారు టెక్‌ నిపుణులు. ఇదిలా ఉంటే మన దేశంలో ఈ కోర్స్‌ మీద ఉద్యోగావకాశాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి.  రానున్న రోజుల్లో కృత్రిమ మేధస్సు కోర్సుపై పట్టు సాధించిన ఇంజినీర్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు వెస్ట్రన్‌ దేశాల్లో మాత్రం చాలా ఏళ్లుగా అవకాశాలు అందిస్తోంది. తాజాగా టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌.. ట్విటర్‌ ద్వారా జాబ్స్‌ ఆఫర్‌ చేశాడు. ఏఐ ఇంజినీర్లకు నియామకాలంటూ ట్వీట్‌లో ఆయన పేర్కొన్నాడు. టెస్లాలో సాంకేతికతను విస్తరించడంలో భాగంగా ఈ నియామకాలు చేపడుతున్నట్లు ఓ ప్రకటనలోనూ ఆయన పేర్కొన్నాడు. అంతేకాదు ఏ దేశం వాళ్లకైనా ఈ నియామకాలు వర్తిస్తాయని స్పష్టత ఇచ్చాడు.


 

మరిన్ని వార్తలు