యాక్సెంచర్‌ సంచలనం: ఏకంగా 19వేల మందికి ఉద్వాసన

23 Mar, 2023 18:17 IST|Sakshi

సాక్షి,ముంబై: ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఐటీ కంపెనీలను భారీగా ప్రభావితం చేస్తోంది. తాజాగా ప్రముఖ ఐటీ కంపెనీ యాక్సెంచర్‌ కూడా తన ఉద్యోగులకు భారీ షాక్‌ ఇస్తోంది. కంపెనీ ఆదాయ క్షీణత నేపథ్యంలో 19వేల ఉద్యోగాలను తీసివేయనుంది. అటు వార్షిక రాబడి, లాభాల అంచనాలను కూడా తగ్గించింది. ఈ మేరకు కంపెనీ గురువారం అధికారికంగా  ప్రకటించింది. అయితే ఇందులో ఎంతమంది భారతీయ ఉద్యోగులు ప్రభావితం కానున్నారనేదానిపై స్పష్టత లేదు.

తమ సిబ్బందిలో 2.5 శాతం లేదా 19,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు తెలిపింది. సగానికి పైగా తొలగింపులు నాన్‌ బిల్‌ కార్పొరేట్ ఫంక్షన్ల సిబ్బందిని ప్రభావితం చేస్తాయని వెల్లడించింది. మరోవైపు యాక్సెంచర్ తమ వార్షిక రాబడి వృద్ధిని కూడా కుదించుకుంది. గతంలో అంచనా వేసిన 8-11 శాతంతో పోలిస్తే   8-10శాతం మధ్య ఉంటుందని  భావిస్తోంది. 

(ఇదీ చదవండి: ట్యాక్స్‌పేయర్ల కోసం స్పెషల్ యాప్‌, ఎలా పనిచేస్తుంది?)

2023 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో, ముఖ్యంగా వ్యూహాత్మక వృద్ధి ప్రాధాన్యతలకు మద్దతు నిమిత్తం నియామకాలను కొనసాగిస్తున్న క్రమంలో తమ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి , ఖర్చులను తగ్గించడానికి ఈ చర్యలను ప్రారంభించామని రాబోయే 18 నెలల్లో ఉద్యోగుల కోతలుంటాయని తెలిపింది.  అంతేకాదు  గతంలో 11.20 -11.52 డాలర్లతో పోలిస్తే ఒక్కో షేరుకు సంపాదన10.84-11.06 డాలర్ల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. (సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు)

(రూ. 32 వేల బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ. 1,999కే)

మరిన్ని వార్తలు