మచిలీపట్నంలో ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌

25 May, 2022 14:21 IST|Sakshi

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే లక్ష కోట్లకు పైచిలుకు పెట్టుబడులు వచ్చాయి. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్‌ స్వయంగా వివరిస్తున్నారు. తాజాగా మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌ ఏర్పాటుపై ఏంఓయూ కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్, కంపెనీ తరఫున అనిల్‌ చలమలశెట్టిలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

చదవండి: CM YS Jagan Davos Tour: ఏపీకి మరో రూ.65 వేల కోట్లు

మరిన్ని వార్తలు