వాహనాల డిమాండ్‌ పెరిగింది, ఆటో మొబైల్‌ రంగం పుంజుకుంది

4 Aug, 2021 13:32 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీయ ఆటో పరిశ్రమ భవిష్యత్తు ఆశాజనకంగా మారింది. ముడి సరుకుల ధరల పెరుగుదల, లాజిసిక్ట్‌ సవాళ్ల నేపథ్యంలోను దేశీయ ఆటో పరిశ్రమ క్రమంగా కోలుకుంటుందని ఆటోమోటివ్‌ కాంపోనెంట్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏసీఎంఏ) తెలిపింది. ఆర్ధిక వ్యవస్థ క్రమంగా సాధారణ స్థితికి చేరుకోవటం, వాహనాల డిమాండ్‌ పెరగడంతో ఈ ఆర్ధిక సంవత్సరంలో పరిశ్రమ పనితీరు ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేసింది. కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌పై ఆధారపడి పరిశ్రమ పనితీరు ఆధారపడి ఉంటుందని తెలిపింది.

 గత ఫైనాన్షియల్‌ ఇయర్‌లో పరిశ్రమ టర్నోవర్‌లో 3 శాతం క్షీణతతో రూ.3.40 లక్షల కోట్లకు చేరిందని ఏసీఎంఏ ప్రెసిడెంట్‌ దీపక్‌ జైన్‌ తెలిపారు. సెమీకండక్టర్ల లభ్యత, ముడిసరుకుల ధరల వృద్ధి, లాజిస్టిక్స్‌ ఇబ్బందులు, కంటైనర్ల అధిక ధరలు వంటివి పరిశ్రమ రికవరీకి అడ్డంకులుగా మారాయని చెప్పారు. వివిధ సవాళ్ల కారణంగా నిలిచిపోయిన పెట్టుబడులు పరిశ్రమ వృద్ధితో ఇన్వెస్ట్‌ చేయడానికి సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు. ఆటో పరిశ్రమ బిలియన్‌ డాలర్ల పెట్టుబడి అవకాశాలను కోల్పోయిందని.. ఇది ఇండస్ట్రీ వృద్ధిని చూసినప్పుడు 2018–19లో మొత్తం క్యాపెక్స్‌గా ఉండేదని ఆయన తెలిపారు. 

పరిశ్రమ వ్యయాల తగ్గింపు, స్థానికీకరణ చర్యలపై దృష్టిపెడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఆటోమోటివ్‌ పరిశ్రమలో 60–70 శాతం సామర్థ్య వినియోగం ఉన్పప్పటికీ ఉద్యోగుల పరిస్థితి స్థిరంగా ఉందన్నారు. తక్కువ దిగుమతి సుంకాలు కోరుకుతున్న టెస్లా.. స్థానిక తయారీపై దృష్టి సారిస్తే ఏసీఎంఏ మద్దతు ఇస్తుందని చెప్పారు. హర్యానాలో స్థానికులకు 75 శాతం ఉద్యోగ రిజర్వేషన్లు ఉండటంతో పరిశ్రమపై ప్రభావం చూపించిందని.. ఇలాంటి నిర్ణయాలు పోటీతత్వాన్ని తగ్గిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
 

మరిన్ని వార్తలు