కొత్త వ్యాపారంలోకి నయన్‌, అంత సాహసం ఎందుకు చేస్తోంది? క్లారిటీ?

24 May, 2023 11:21 IST|Sakshi

సాక్షి,ముంబై: లేడీ సూపర్‌ స్టార్‌ క్రేజ్‌ తెచ్చుకున్న నయనతార మరోసారి తన ప్రత్యకతను చాటుకునేందుకు సిద్ధమవుతోంది. అటు సినిమాలు ఇటు వ్యాపారం లోనూ రాణిస్తున్న నయనతార  తాజాగా మ‌రో కొత్త బిజినెస్‌లోకి ఎంట‌ర్ అవుతోన్న‌ట్లు తెలుస్తోంది. భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి ఉత్తర చెన్నైలోని 56 ఏళ్ల నాటి పాత అగస్త్య థియేటర్‌ను కొనుగోలు చేసినట్టు సమాచారం. 

అలాంటిదేమీలేదు
నయనతార, విఘ్నేష్ శివన్ కోలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నటులు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చెన్నై థియేటర్‌ని సొంతం చేసుకునే ఆలోచనలో ఉన్నారని సోషల్ మీడియాలో పుకార్లకు చెక్‌ పడినట్టే కనిపిస్తోంది. దర్శకుడు, నయన్‌ సన్నిహితుడు ఈ వార్తలను కొట్టి పారేశారు.  ఎలాంటి థియేటర్‌ను కొనడానికి ప్లాన్ చేయడం లేదంటూ ‍స్పష్టం చేశారు.  అయితే దీనిపై నయన్‌, విఘ్నేష్‌ నుంచి  అధికారికంగా  ప్రకటన వస్తే తప్ప  క్లారిటీ ఉండదు.

ఇప్పటికే అనేక వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టిన  టాప్‌  సౌత్‌ ఇండియాన్‌ స్టార్‌ నయన్‌  ఇపుడిక థియేటర్‌ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్త హల్‌చల్‌ చేస్తోంది. తమ నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్ కింద చెన్నైలో తొలి ఆస్తిని కొనుగోలు చేసారనేది టాక్‌. ఉత్తర చెన్నై ప్రాంతంలో, దేవి థియేటర్ గ్రూప్ యాజమాన్యంలోని అగస్త్య థియేటర్ 1967నుంచి పనిచేస్తోంది. తమిళ టాప్‌ స్టార్లు ఎంజీఆర్‌, శివాజీ గణేశన్ మొదలు రజనీ కాంత్‌, కమల్  హాసన్‌,  అజిత్, విజయ్ దాకా లెక్కలేనన్ని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను ప్రదర్శించింది.

సింగిల్ స్క్రీన్ థియేటర్ కరోనా, లాక్‌డౌన్‌ కాలంలో చిక్కుల్లో పడింది. దీంతో 2020లో దీన్ని మూసి వేశారు. 1000 సీటింగ్ కెపాసిటీతో కూడిన థియేట‌ర్‌ను రెండు స్క్రీన్‌లతో మ‌ల్టీప్లెక్స్‌గా రెన్నోవేట్ చేసి ఈ ఏడాది చివరికి  తిరిగి లాంచ్‌ చేయనున్నారంటూ  సోషల్‌ మీడియా కోడై కూస్తోంది.

కాగా నయనతార ప్రస్తుతం  అట్లీ  డైరెక్షన్‌లో  బాలీవుడ్‌ మూవీ 'జవాన్' లో  విజయ్ సేతుపతి, షారుక్ ఖాన్ సరసన నటిస్తోంది. ఈ  సినిమా సెప్టెంబర్ 7 న విడుదల కానుంది. దీంతోపాటు  'లేడీ సూపర్ స్టార్ 75'  ఆర్. మాధవన్‌తో తన తొలిచిత్రం 'ద టెస్ట్' చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.  మరోవైపు, విఘ్నేష్ శివన్ ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైనాడు.

మరిన్ని వార్తలు