సన్నీలియోన్‌ అరుదైన ఫీట్‌.. తన ఎన్‌ఎఫ్‌టీ కలెక్షన్స్‌తో వేలం

4 Sep, 2021 12:16 IST|Sakshi

అడల్ట్‌ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుని.. ఆపై హిందీ బిగ్‌బాస్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది సన్నీ లియోన్‌(కర‌ణ్‌జిత్‌ కౌర్‌ వోహ్రా). మిగతా భాషల్లోనూ నటిగా, ఐటెం సాంగ్‌లతో అవకాశాలు అందిపుచ్చుకుంటోందామె. తాజాగా సన్నీ మరో ఫీట్‌ సాధించింది. బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీలో నాన్‌-ఫంగిబుల్‌ టోకెన్స్‌(NFTs) వైపు అడుగులేసింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఫిమేల్‌ ఇండియన్‌ సెలబ్రిటీగా నిలిచింది.
 

ఈ మధ్యే బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఎన్‌ఎఫ్‌టీ కలెక్షన్‌ ప్రారంభించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలోనే ఈ ఘనత అందుకున్న తొలి సెలబ్రిటీగా నిలిచారాయన. ఈ నేపథ్యంలో డిజిటల్‌ ఆస్తుల్ని వెనకేసుకునే పనిలో ఇప్పుడు సన్నీ లియోన్‌(40) కూడా తలమునకలైంది. ఇందుకోసం సన్నీ లియోన్‌.. సిలికాన్‌ వ్యాలీకి చెందిన మింట్‌డ్రోప్జ్‌తో చేతులు కలపింది. ప్రత్యేక వెబ్‌సైట్‌ తన ఆర్ట్‌ వర్క్‌కు చెందిన ఎన్‌ఎఫ్‌టీ కలెక్షన్లను(ఈథేరియం బ్లాక్‌ చెయిన్‌) వేలం వేయనుంది.

 

ఎన్‌ఎఫ్‌టీ అంటే డిజిటల్‌ ఆస్తులు. సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు, వీడియోలను సైతం డిజిటల్‌ ఫార్మాట్‌లోకి మార్చి బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్‌ వర్క్‌ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఈ డిజిటల్‌ ఎస్సెట్స్‌, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. అలా వీటిని నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్‌ చైయిన్‌ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది.
 

భారత్‌లో 2021 జూన్‌లో వాజిర్‌ ఎక్స్‌.. ఎన్‌ఎఫ్‌టీ మార్కెట్‌ ప్లేస్‌లో అడుగుపెట్టిన మొదటి ప్లాట్‌ఫామ్‌గా గుర్తింపు దక్కించుకుంది. ఆ టైంలో కాన్వాస్‌ ఆర్టిస్టులు, డిజిటల్‌ ఆర్టిస్టులు వాళ్ల టోకెన్లను అమ్ముకోవడానికి ఆసక్తి చూపించారు. అయితే దేశంలో అమితాబ్‌ బచ్చన్‌ కంటే ముందు సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ఎన్‌ఎఫ్‌టీ ఘనత దక్కించుకున్నారు. కానీ, అది వ్యక్తిగతంగా కాదు. శివాజీ ది బాస్‌ సినిమా 14 ఏళ్ల రిలీజ్‌ పూర్తైన సందర్భంగా మొన్న జులైలో ఇద్దరు టీనేజర్లు..  సినిమా పేరిట ఎన్‌ఎఫ్‌టీ కలెక్షన్‌ను ప్రారంభించారు.

చదవండి:  ఫ్రస్టేట్‌ జర్నలిస్ట్‌ వీడియో.. జాక్‌పాట్‌

మరిన్ని వార్తలు