అదానీ దూకుడు.. అసలు తగ్గేలా లేడే !

22 Mar, 2022 10:17 IST|Sakshi

అదానీ గ్రీన్‌ ఎనర్జీ రూ.2,188 కోట్ల సమీకరణ 

న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో ఉన్న అదానీ గ్రీన్‌ ఎనర్జీ (ఏజీఈఎల్‌) రూ.2,188 కోట్లు సమీకరించింది. విదేశీ సంస్థలైన బీఎన్‌పీ పారిబస్, కో–ఆపరేటివ్‌ రబోబ్యాంక్‌ యూఏ, ఇంటెసా సావోపాలో ఎస్‌పీఏ, ఎంయూఎఫ్‌జీ బ్యాంక్, సొసైటీ జనరాలే, స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్, సుమిటోమో మిత్సుయి బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌ నుంచి ఈ నిధులను  పొందినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. 

ఈ మొత్తాన్ని రాజస్తాన్‌లో ఏర్పాటు చేస్తున్న 450 మెగావాట్ల సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టుకు వెచి్చస్తారు. తాజా డీల్‌తో కలిపి ఏజీఈఎల్‌ రూ.12,464 కోట్ల నిధులను అందుకుంది. 2030 నాటికి 45 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకోవాలన్నది సంస్థ లక్ష్యం. ప్రస్తుతం ఇది సుమారు 14 గిగావాట్లు ఉంది.  

చదవండి: బెజోస్‌ మస్క్‌ అదానీ ముందు దిగదుడుపే!

మరిన్ని వార్తలు