ఎస్‌బీఐకి అదానీ అదనపు షేర్లు

13 Feb, 2023 06:26 IST|Sakshi

జాబితాలో అదానీ పోర్ట్స్, గ్రీన్, ట్రాన్స్‌మిషన్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ వద్ద అదానీ గ్రూప్‌ తాజాగా అదనపు షేర్లను తనఖాలో ఉంచింది. జాబితాలో అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్‌ ఎనర్జీ చేరాయి. బ్యాంకుకు చెందిన ఎస్‌బీఐ క్యాప్‌ ట్రస్టీవద్ద దాదాపు 75 లక్షల షేర్లను అదానీ పోర్ట్స్, 60 లక్షల షేర్లను అదానీ గ్రీన్, 13 లక్షల షేర్లను అదానీ ట్రాన్స్‌మిషన్‌ ప్లెడ్జ్‌ చేశాయి.

దీంతో ఎస్‌బీఐ క్యాప్‌ ట్రస్టీవద్ద అదానీ పోర్ట్స్‌ ఈక్విటీలో మొత్తం 1 శాతం, అదానీ గ్రీన్‌ నుంచి 1.06 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్‌కు చెందిన 0.55 శాతం వాటాను తనఖాలో ఉంచినట్లు తెలుస్తోంది. 30 కోట్ల డాలర్ల లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌లో భాగంగా అదనపు షేర్లను అదానీ గ్రూప్‌ ఎస్‌బీఐ క్యాప్‌వద్ద ఉంచినట్లు ఎక్సే్ఛంజీల ఫైలింగ్‌ వెల్లడించింది. తద్వారా ఆస్ట్రేలియాలోని కార్మిచేల్‌ కోల్‌ మైనింగ్‌ ప్రాజెక్టు కోసం ఎస్‌బీఐ చెల్లింపుల గ్యారంటీని ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు