అదానీ దూకుడు, ఓపెన్‌ ఆఫర్‌ డేట్‌ ఫిక్స్‌, షేర్‌ ప్రైస్‌ ఎంతంటే?

31 Aug, 2022 12:47 IST|Sakshi

ఎన్‌డీటీవీ అదనపు వాటా కొనుగోలు, వేగంగా కదులుతున్న అదానీ గ్రూపు

న్యూఢిల్లీ: మీడియా సంస్థ ఎన్‌డీటీవీలో అదనంగా 26 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు అదానీగ్రూప్ మరింత వేగంగా అడుగులు వేస్తోంది. ఈ వాటా  కొనుగోలుకు సంబంధించి తన ఓపెన్ ఆఫర్‌ను అక్టోబర్ 17న ప్రారంభించనుంది.1.67 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలుకు సంబంధించిన ఈ  ఓపెన్ ఆఫర్‌లో ఒక్కో షేరు ధర రూ. 294గా నిర్ణయించిందని   జేఎం ఫైనాన్షియల్  ప్రకటించింది.

గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ అనుబంధ సంస్థల ద్వారా బహుళ-లేయర్డ్ లావాదేవీలతో ఎన్డీటీవీలో మొత్తం 55శాతం వాటాను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. అదానీ గ్రూప్, మీడియా సంస్థలో 29.18వాటాను కొనుగోలు చేయాలనే గ్రూప్ ప్రణాళికలకు అనుగుణంగా, ఓపెన్ ఆఫర్ కోసం తాత్కాలిక ప్రారంభ తేదీగా అక్టోబర్ 17ని నిర్ణయించింది.ఇష్యూకు మేనేజర్  జేఎం ఫైనాన్షియల్ పబ్లిక్ ప్రకటన ప్రకారం, ఆఫర్ తాత్కాలికంగా నవంబర్ 1న ముగియనుంది. ఓపెన్ ఆఫర్‌కు అనుగుణంగా, ఓపెన్ ఆఫర్‌లో పూర్తి అంగీకారం ఉందని భావించి, కొనుగోలుదారు, ఓటింగ్ షేర్ క్యాపిటల్‌లో 26శాతం వరకు పొందవలసి ఉంటుంది. ఒక్కో షేరుకు రూ. 294 ధరతో పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయితే, ఓపెన్ ఆఫర్ మొత్తం రూ. 492.81 కోట్లుగా ఉంటుంది.  (ఢిల్లీ టూ సిమ్లా: విమాన టికెట్‌ ధర కేవలం రూ. 2480)

కాగా  ఆగస్టు 23న, ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్‌లో 99.99 శాతం వాటాను కలిగి ఉన్న విశ్వప్రధాన కమర్షియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కొనుగోలు ద్వారా ఎన్డీటీవీలో  29.18 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌కు చెందిన ఏఎంజీ మీడియా నెట్‌వర్క్‌ లిమిటెడ్‌లో భాగమైన వీపీసీఎల్‌ వాటా తీసుకున్నామని వివరించింది. ఎన్డీటీవీలో ఆర్‌ఆర్‌పీఆర్‌ ప్రమోటర్‌ గ్రూప్‌ కంపెనీ. ఇందులో 29.18 శాతం వారికి వాటా ఉంది. ఎన్‌డీటీవీలో మరో 26 శాతం వాటా కొనుగోలుకు వీసీపీఎల్‌, ఏఎంఎన్‌ఎల్‌, ఏఈఎల్‌ కలిసి ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. (Share Pledging Case: కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు భారీ ఊరట!)

మరిన్ని వార్తలు