Adani Group: రెడీగా ఉండండి.. త్వరలో అదానీ గ్రూప్‌ నుంచి ఐపీఓ!

29 Jul, 2022 13:30 IST|Sakshi

ప్రముఖ వ్యాపారవేత్త, ఆసియా కుబేరుడు గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ నుంచి మరో కంపెనీ ఐపీఓకి రానుంది. 2024 కల్లా బ్యాంకింగేతర సంస్థ అయిన ‘అదానీ క్యాపిటల్‌’ను పబ్లిక్‌ ఆఫర్‌కు తీసుకొచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు కంపెనీ ఎండీ సీఈఓ గౌరవ్‌ గుప్తా వెల్లడించారు. అందుకోసం అదానీ క్యాపిటల్‌ నుంచి 10 శాతం వాటా విక్రయించడం ద్వారా 1500 కోట్ల నిధులను సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు తెలిపారు. గతంలో ఈ గ్రూప్‌ నుంచి అదానీ విల్మర్‌ ఐపీఓకి వచ్చిన సంగతి తెలసిందే.

అదానీ క్యాపిటల్ 2017 ఏప్రిల్‌లో ఎన్​బీఎఫ్​సీ విభాగంలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి వ్యాపారం రిటైల్, గ్రామీణ ఫైనాన్సింగ్‌ విభాగంపై దృష్టి పెట్టింది. వ్యవసాయ పరికరాలు, చిన్న వాణిజ్య వాహనాలు, 3-వీలర్లు, వ్యవసాయ రుణాలను అందిస్తూ వస్తోంది. వీటితో పాటు ఎంఎస్‌ఎంఈ( MSME) వ్యాపార రుణాలను కూడా ఇస్తుంది. అదానీ క్యాపిటల్​కు దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో 154 బ్రాంచీలు ఉన్నాయి. 60,000 మంది రుణగ్రహీతలు ఉన్నారు. ప్రస్తుతం, కంపెనీ గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ & మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది.

చదవండి: Passport: పాస్‌పోర్ట్‌ ఉంటే చాలు.. వీసా లేకపోయినా 60 దేశాలు చుట్టేయచ్చు!

మరిన్ని వార్తలు