అదానీ గ్రూప్‌ మరో కీలక నిర్ణయం!

19 Mar, 2023 21:36 IST|Sakshi

ప్రముఖ దిగ్గజ సంస్థ అదానీ గ్రూప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని చూరగొనడం కోసం పలు కీలక చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా గుజరాత్‌లోని ముంద్రాలో చేపట్టిన రూ.34,900 కోట్ల విలువ చేసే పెట్రో కెమికల్‌ ప్రాజెక్టు పనులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

2021లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌కు చెందిన స్థలంలో ముంద్రా పెట్రోకెమ్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. బొగ్గు నుంచి పీవీసీ వరకు ఉత్పత్తి చేసేలా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

అయితే, హిండెన్‌బర్గ్‌ ఆరోపణల తర్వాత ఇన్వెస్టర్లలో సంస్థపై నమ్మకాన్ని కలిగించేలా రుణాలను తిరిగి చెల్లించింది. కొత్త ప్రాజెక్టులను చేపట్టడం నిలిపివేసింది. అందులో భాగంగానే తాజాగా ముంద్రా ప్రాజెక్టును పక్కన పెట్టింది. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు