అదానీ గ్రూపు షేర్లకు ఎంఎస్‌సీఐ షాక్‌, కానీ..!

10 Feb, 2023 10:54 IST|Sakshi

సాక్షి, ముంబై:  బిలియనీర్‌  గౌతం అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపు మరో ఎదురుదెబ్బ తగిలింది.  అమెరికా షార్ట్‌ సెల్లింగ్‌  సంస్థ హిండెన్‌ బర్గ్‌  కార్పొరేట్‌ మోసాల ఆరోపణల తరువాత  అదానీ గ్రూపు భారీగా నష్టాలను మూటగట్టుకుంది. మార్కెట్‌ క్యాప్‌లో 100 బిలియన్‌ డాలర్ల కోల్పోయింది. తాజాగా అంతర్జాతీయ ఇన్వెస్టర్ల ట్రాకింగ్‌ సంస్థ  మోర్గాన్‌ స్టాన్లీ క్యాపిటల్‌ ఇంటర్నేషనల్‌ (ఎంఎస్‌సీఐ)  అదానీ గ్రూపు  షేర్ల  వెయిటేజీని తగ్గించింది.  దీంతో శుక్రవారం కూడా మార్కెట్లో  అదానీ  ఫ్లాగ్‌షిప్‌  కంపెనీ షేర్ల నష్టాలు కొనసాగుతున్నాయి. 

ఇండెక్స్ ప్రొవైడర్ఎంఎస్‌సీఐ)  నాలుగు  అదానీ గ్రూప్ స్టాక్‌ల ఫ్రీ-ఫ్లోట్ డిగ్జినేషన్‌లను  ఫ్రీఫ్లోట్‌ను తగ్గించింది.  అయితే దాని గ్లోబల్ ఇండెక్స్‌ల నుండి ఏ స్టాక్‌లను తొలగించలేదని తెలిపింది. జనవరి 30 నాటికి ఎంఎస్‌సీఐ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్ ఏసీసీ ఫ్రీ ఫ్లోట్‌లను తగ్గించింది. నువామా ఆల్టర్నేటివ్ & క్వాంటిటేటివ్ రీసెర్చ్ అంచనాల ప్రకారం, ఈ చర్య తీసుకున్నది. మిగిలిన అదానీ గ్రూప్ కంపెనీలకు ఉచిత ఫ్లోట్‌లు అలాగే ఉంటాయని  తెలిపింది.  

నాలుగు అదానీ గ్రూప్ కంపెనీల నుండి మొత్తం 428 మిలియన్‌ డాలర్ల ఔట్‌ ఫ్లో ఉంటుందని ఎంఎస్‌సీఐ అంచనా వేసింది. ఇందులో  అదానీ ఎంటర్‌ప్రైజెస్ 161 మిలియన్‌ డాలర్ల, అదానీ ట్రాన్స్‌మిషన్ 145 మిలియన్‌ డాలర్ల , అదానీ టోటల్ గ్యాస్ 110 మిలియన్‌ డాలర్లు, ఏసీసీ 12 మిలిన్‌ డాలర్లు ఉంటాయని తెలిపింది. అలాగే  ఎంఎస్‌సీఐ  ఇండెక్స్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా,  సీసీ పవర్ & ఇండస్ట్రియల్‌లను జోడించగా బయోకాన్‌ను తొలగించింది. తాజా మార్పులు మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయి.

షేర్ల పతనం
ఈ నేపథ్యంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ 8శాతం, అదానీ టోటల్ గ్యాస్ 6.4 శాతం అదానీ ట్రాన్స్‌మిషన్ 5 శాతం, అదానీ పవర్ 5 శాతం అదానీ విల్మార్ 3 శాతం క్షీణించాయి. మరోవైపు  అదానీ పోర్ట్స్ అదానీ గ్రీన్ ఎనర్జీ,  ఏసీసీ, ఎన్‌డీటీవీ, అంబుజా సిమెంట్‌ లాభాల్లు  ఉన్నాయి. 
 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు