హిండెన్‌బర్గ్‌ వివాదం: అదానీ గ్రూపు ప్రమోటర్స్‌ సంచలన నిర్ణయం

6 Feb, 2023 16:12 IST|Sakshi

సాక్షి,ముంబై: అదానీ గ్రూప్- హిండెన్‌బర్గ్‌ వివాదం తరువాత మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సెప్టెంబర్ 2024నాటికి  చెల్లించాల్సిన ప్లెడ్జ్‌ షేర్ల రిలీజ్‌ కోసం భారీ మొత్తాన్ని ముందుగానే చెల్లించనుంది. 1.1 బిలియన్‌ డాలర్లను చెల్లించనుంది. ఈమేరకు కంపెనీ ఒక ప్రకటన జారీ  చేసింది.

(ఇదీ చదవండి: అదానీ-హిండెన్‌బర్గ్: అదానీకి మరోషాక్‌! ఆ ప్రమాదం ఎక్కువే?)

ఇటీవలి మార్కెట్ అస్థిరత దృష్ట్యా, అదానీ లిస్టెడ్ కంపెనీల షేర్ల మద్దతుతో మొత్తం ప్రమోటర్ పరపతిని తగ్గించడానికి ప్రమోటర్ల నిబద్ధత కొనసాగింపులో, మెచ్యూరిటీ కంటే ముందే 1,114 మిలియన డాలర్ల ప్రీ-పే మొత్తాలను చెల్లించనున్నామని ప్రకటించింది. ముందస్తు చెల్లింపులో భాగంగా ప్రమోటర్ హోల్డింగ్‌లో 12 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అదానీ పోర్ట్స్ అండ్‌ స్పెషల్ ఎకనామిక్ జోన్‌ల 168.27 మిలియన్ షేర్లు విడుదల చేయనుంది. అదానీ గ్రీన్ విషయానికొస్తే, ప్రమోటర్ హోల్డింగ్‌లో 3 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 27.56 మిలియన్ షేర్లను రిలీజ్‌ చేయనుంది. అలాగే, ప్రమోటర్ హోల్డింగ్‌లో 1.4 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అదానీ ట్రాన్స్‌మిషన్‌లోని 11.77 మిలియన్ షేర్లను రిలీజ్‌ చేయనుంది.

కాగా అదానీ గ్రీన్ స్క్రిప్  వరుగా నాలుగో సెషన్లోనూ సోమవారం నాడు 5శాతం పడి లోయర్ సర్క్యూట్ అయింది. గత నెలతో పోలిస్తే  సగానికి పైగా కోల్పోయింది. అదానీ గ్రూపు గత కొన్ని దశాబ్దాలుగా స్టాక్ మానిప్యులేషన్‌, అకౌంటింగ్ మోసాలు పాల్పడిందనే ఆరోపణలతో  ఆమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు  మార్కెట్లో ప్రకంపనలు రేపింది. దాదాపు 10 లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీలు భారీ నష్టాన్ని చవిచూశాయి. అయితే అదానీ గ్రూప్ హిండెన్‌బర్గ్  వాదనలను నిరాధారమైనదని కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. 

(ఇదీ చదవండి:  Tech layoffs మరో టాప్‌ కంపెనీ నుంచి 6650 ఉద్యోగులు ఔట్‌!)

మరిన్ని వార్తలు