గంగవరం పోర్ట్‌.. అదానీ పరం

11 Oct, 2022 14:51 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గంగవరం పోర్ట్‌ లిమిటెడ్‌లో (జీపీఎల్‌) మిగిలిన 58.1 శాతం వాటాను  కొనుగోలు చేసేందుకు ఎన్‌సీఎల్‌టీ అహ్మదాబాద్, ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ నుండి అనుమతులు పొందినట్టు అదానీ పోర్ట్స్, స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్స్‌ (ఏపీఎస్‌ఈజడ్‌) సోమవారం వెల్లడించింది. షేర్‌–స్వాప్‌ విధానం ద్వారా డీవీఎస్‌ రాజు, కుటుంబం నుండి 58.1 శాతం వాటాను ఏపీఎస్‌ఈజడ్‌ కొనుగోలు చేస్తోంది.

దీని ఫలితంగా పూర్వపు జీపీఎల్‌ ప్రమోటర్లకు దాదాపు 4.77 కోట్ల ఏపీఎస్‌ఈజడ్‌ షేర్లు జారీ చేస్తారు. కొనుగోలు పూర్తి అయితే జీపీఎల్‌లో ఏపీఎస్‌ఈజడ్‌కు 100 శాతం వాటా ఉంటుంది. జీపీఎల్‌ను రూ.6,204 కోట్లకు (ఒక్కొక్కటి రూ.120 చొప్పున 51.7 కోట్ల షేర్లు)  కొనుగోలు చేసినట్టు ఏపీఎస్‌ఈజడ్‌ ప్రకటించింది. గంగవరం పోర్ట్‌ లిమిటెడ్‌లో వార్‌బర్గ్‌ పింకస్‌ నుంచి 31.5 శాతం వాటాను, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి 10 శాతం వాటాను 2021–22లో అదానీ పోర్ట్స్, స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్స్‌ దక్కించుకుంది.

చదవండి: మూడేళ్ల సీక్రెట్‌ బయటపడింది.. స్వయంగా ఆర్డర్లు డెలివరీ చేస్తున్న సీఈఓ!

మరిన్ని వార్తలు