అదానీ పవర్‌కు లాభాలే లాభాలు

8 May, 2023 08:56 IST|Sakshi

న్యూఢిల్లీ: అదానీ పవర్‌ మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికి రూ.5,242 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.4,645 కోట్లతో పోలిస్తే 13 శాతం పెరిగింది.

మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.13,307 కోట్లతో పోలిస్తే 19 శాతం క్షీణించి రూ.10,795 కోట్లకు పరిమితమైంది. లాభం వృద్ధి చెందడానికి రుణ వ్యయాలు తగ్గడం, సబ్సిడరీల విలీనం కలిసొచ్చినట్టు అదానీ పవర్‌ లిమిటెడ్‌ తెలిపింది.

మొత్తం వ్యయాలు మార్చి త్రైమాసికంలో 30 శాతానికి పైగా పెరిగి రూ.9,897 కోట్లకు పెరిగింది. ఇక 2022–23 ఆర్థిక సంవత్సరానికి కన్సాలిడేటెడ్‌ నికర లాభం 118 శాతం పెరిగి రూ.10727 కోట్లకు చేరుకుంది. ఆదాయం రూ.14,312 కోట్లుగా నమోదైంది అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.4,912 కోట్లు, ఆదాయం రూ.13,789 కోట్ల చొప్పున ఉన్నాయి. మార్చి త్రైమాసికంలో 52 శాతం ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ను చేరుకుంది. అదానీ పవర్‌కు 14,410 మెగావాట్ల స్థాపిత థర్మల్‌ విద్యుత్‌ ఉత్పాదన సామర్థ్యం ఉంది.    

మరిన్ని వార్తలు