అదానీకి రాజ్యసభ సీటు?.. క్లారిటీ ఇచ్చిన సంస్థ

15 May, 2022 19:11 IST|Sakshi

ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ.. రాజకీయాల్లోకి రానున్నారా..? ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తున్నారా..? దీనిపై కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై అదానీ సంస్థ తరఫున ఓ ప్రకటన విడులైంది. ఏపీ నుంచి గౌతమ్ అదానీ లేదా అతడి భార్య ప్రీతి అదానీలలో ఒకరికి రాజ్యసభ సీటు గ్యారెంటీ అంటూ వస్తున్న వార్తలపై అదానీ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఇదంతా తప్పుడు ప్రచారమంటూ కొట్టిపారేసింది. 

గౌతమ్ అదానీకి గానీ, అతడి భార్య ప్రీతి అదానీకి గానీ రాజ్యసభ సీటు ఇస్తున్నారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం అదాని సంస్థ ట్విట్టర్‌ వేదికగా స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అదానీ ఫ్యామిలీలో ఎవరికీ రాజకీయాల మీద ఆసక్తి లేదని, ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని సంస్థ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఫేక్‌ వార్తలకు అదాని చెక్‌ పెట్టారు. 

మరిన్ని వార్తలు