గూగుల్‌ మ్యాప్స్‌తో మీ వ్యాపారాన్ని ఇలా అభివృద్ధి పరచండి..!

28 Jul, 2021 21:53 IST|Sakshi

ప్రస్తుతం ఉన్న సాంకేతికతతో ప్రతి ఒక్కరు గూగుల్‌మ్యాప్స్‌ను ఉపయోగించి దగ్గరలో ఉన్న వివిధ షాప్‌లను తెలుసుకుంటున్నారు. గూగుల్‌ మ్యాప్స్‌లో ప్రత్యక్షమయ్యే ఆయా షాపు వివరాలను తెలుసుకొని వినియోగదారులు షాపులకు సందర్శిస్తున్నారు. గూగుల్‌ మ్యాప్స్‌తో ఒక్కింతా వినియోగదారులకు, వ్యాపార వర్గాల వరకు చాలా మేలు చేకూరుతుంది. మీరు వ్యాపారం చేసే రెస్టారెంట్‌, సెలూన్‌, ఇతర షాప్‌లను గూగుల్‌ మ్యాప్స్‌లో నమోదు చేసుకోవడం ద్వారా మీ వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసుకోవచ్చునని మీ​కు తెలుసా..? తెలియదా అయితే ఇది మీ కోసమే..! గూగుల్‌మ్యాప్స్‌లో మీ వ్యాపారాలను నమోదు చేసుకోవడంతో మీ వ్యాపారాన్ని గణనీయంగా అభివృద్ధి చేసుకోవచ్చును. గూగుల్‌ మ్యాప్స్‌లో మీ వ్యాపారాన్ని నమోదు చేసుకోవడం ద్వారా వినియోగదారులకు మీ వ్యాపార సముదాయాలు కన్పిస్తాయి.  


మీ వ్యాపారాలను గూగుల్‌ మ్యాప్స్‌లో ఇలా యాడ్‌ చేయండి.

1. వెబ్‌ బ్రౌజర్‌లో ‘గూగుల్‌ మై బిజినెస్‌’ లో ముందుగా లాగిన్‌ అవ్వండి. ఒకవేళ మీకు బిజినెస్‌ అకౌంట్‌ లేకుంటే క్రియోట్‌ అకౌంట్‌ మీద క్లిక్‌ మీద చేయండి. 

2. మై బిజినెస్ హోమ్‌పేజీలో  ‘మేనేజ్‌ నౌ’ క్లిక్‌ చేయండి. మరో స్క్రీన్‌లో మీ బిజినెస్‌ వివరాలను సెర్చ్‌ బార్‌లో ఎంటర్‌ చేయండి. సెర్చ్‌ బార్‌ కింద డ్రాప్‌ డౌన్‌లో  ‘క్రియేట్‌ బిజినెస్‌ విత్‌ దిస్‌ నేమ్‌’ ను ఎంచుకోండి.

నోట్‌: ఒక వేళ డ్రాప్‌ డౌన్‌లో మీ బిజినెస్‌ నేమ్‌, చిరునామా కనిపిస్తే..మీ బిజినెస్‌ అల్‌రెడీ గూగుల్‌ మ్యాప్స్‌లో లిస్ట్‌ ఐనట్లు లెక్క. దానిని మీ వ్యాపారం గా క్లైమ్‌ చేసుకోండి.  

3. తరువాతి పేజీలో మీ బిజినెస్‌ నేమ్‌. బిజినెస్‌ కేటగిరీలను ఇ‍వ్వండి. మీ వ్యాపారానికి సంబంధించిన కేటగిరీని ఎంచుకోండి.

4. తరువాత  మీ వ్యాపార స్థలం గూగుల్‌ మ్యాప్స్‌లో కనిపించాలనుకుంటున్నారా అని ఎంచుకోవాలి. ‘యాస్‌ ఆర్‌ నో’ను  ఎంచుకోండి.నెక్ట్స్ బటన్‌పై క్లిక్‌ చేయండి.
గమనిక: ఒక వేళ మీ వ్యాపార సముదాయం మీ ఇంటి దగ్గరలో ఉంటే వ్యాపార స్థలాన్ని గూగుల్‌ మ్యాప్స్‌లో ఉంచకపోవడం మంచింది.

5. మీరు మీ వ్యాపార సముదాయాన్ని గూగుల్‌ మ్యాప్స్‌లో కన్పించాలని ‘యాస్‌’ ను క్లిక్‌ చేసినట్లయితే తరువాతి స్టెప్‌లను ఫాలో అవ్వండి. తరువాతి స్క్రీన్‌లో మీ బిజినెస్‌ అడ్రస్‌ను ఎంటర్‌ చేయండి.


 
6. తరువాతి పేజీలో మీ బిజినెస్‌కు సంబంధించిన ఫోన్‌ నంబర్‌, వెబ్‌సైట్‌ను ఎంటర్‌ చేసి నెక్ట్స్‌ ను క్లిక్‌ చేయండి.

7. మీ వ్యాపారం కోసం గూగుల్‌ బిజినెస్‌ మీకు అప్‌డేట్లను, రికమేండేషన్‌లను పంపాలనుకుంటున్నారో లేదో ఎంచుకోండి తరువాత నెక్ట్స్ క్లిక్‌ చేయండి.

8.  మీరు వ్యాపార అడ్రస్‌ను ఇవ్వకూడదని ఎంచుకుంటే, మీ వ్యాపారాన్ని ధృవీకరించడానికి  మీ వ్యక్తిగత ఈ-మెయిల్‌ను  నమోదు చేయాలి. ఈ అడ్రస్‌ వినియోగదారులకు కనిపించదు. మీ అడ్రస్‌ను నమోదు చేసి నెక్ట్స్ బటన్‌ నొక్కండి లేదా ‘వేరిఫై ల్యాటర్‌’ను  ఎంచుకోండి.

9. మీ వ్యాపారాన్ని ధృవీకరించడానికి ఒక పద్ధతిని ఎంచుకోవడానికి డ్రాప్-డౌన్‌ను క్లిక్ చేయండి. మీ వ్యాపార రకాన్ని బట్టి, మీకు కొన్ని ధృవీకరణ పద్ధతులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మీ బిజినెస్‌ను ఈ-మెయిల్‌,  ఫోన్‌కు గూగుల్‌ పంపే వేరిఫికేషన్‌ కోడ్‌ ద్వారా ధృవీకరణ చేసుకోవచ్చును. మీకు గూగుల్‌ సెర్చ్‌ కన్‌సోల్‌ అకౌంట్‌ ఉంటే వెంటనే వేరిఫై అవుతుంది,

10. తరువాత మీ గూగుల్‌ మై బిజినెస్‌ పేజీని సెటప్ చేయడానికి మీకు వరుస ప్రాంప్ట్‌ల వస్తాయి.  మీరు బిజినెస్‌ అవర్స్‌ను యాడ్‌ చేయవచ్చును. దాంతో పాటుగా మేసేజింగ్‌ పర్మిషన్లను సెట్‌ చేయవచ్చు,  మీ బిజినెస్‌ డిస్క్రిప్షన్‌(వివరణ)ను కూడా  రాయవచ్చు. అంతేకాకుండా వ్యాపారానికి సంబంధించిన ఫోటోలను అప్‌లోడ్ చేయవచ్చు.

11. మీ వ్యాపారాన్ని సెటప్ చేయడానికి అవసరమైన అన్ని సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత,  మీ గూగుల్‌ మై బిజినెస్‌  పేజీకి మళ్లీంచబడతారు, అక్కడ మీరు బిజినెస్‌కు సంబంధించిన లోగో, సహ-నిర్వాహకులు వంటి అదనపు సమాచారాన్ని జోడించవచ్చు.


 

మరిన్ని వార్తలు