అడిడాస్‌ సంచలనం..! ఫేస్‌బుక్‌తో పోటాపోటీగా మెటావర్స్ పై కసరత్తు

25 Nov, 2021 15:22 IST|Sakshi

జపాన్‌ స్పోర్ట్స్‌ షూ మేకింగ్‌ దిగ్గజం అడిడాస్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్‌తో పోటాపోటీగా సొంతంగా మెటావర్స్‌ టెక్నాలజీని డెవలప్‌ చేసే పనిలో పడింది. దీంతో పాటు అమెరికాకు చెందిన క్రిప్టో కరెన్సీ ఎక్ఛేంజ్‌ సంస్థ కాయిన్‌ బేస్‌తో  చేతులు కలిపింది. ఈ ఒప్పొందంపై అడిడాస్‌ ట్విట్‌ చేయగా... కాయిన్‌ బేస్‌ స్పందించింది. హ్యాండ్‌ షేక్‌ ఎమోజీని రీట్వీట్‌ చేస్తూ డీల్‌ను కాన్ఫాం చేసింది. ఇకపై ఈ రెండు సంస్థలు కలిపి క్రిప్టో కరెన్సీపై ట్రేడింగ్‌ నిర్వహించనున్నాయి. 

ఫేస్‌బుక్‌(మెటా) అధినేత మార్క్‌ జుకర్‌ బెర్గ్‌ మెటావర్స్‌ టెక్నాలజీపై వర్క్‌ చేస‍్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే టెక్నాలజీని పలు దిగ్గజ కంపెనీలు సైతం డెవలప్‌ చేసే పనిలో పడ్డాయి. తాజాగా కు చెందిన అడిడాస్‌ 'అడివెర్స్‌' పేరుతో మొబైల్‌ గేమింగ్‌ సంస్థ 'శాండ్‌ బాక్స్‌'తో కలిసి మెటావర్స్‌పై పనిచేస్తున్నట్లు నవంబర్‌ 22న ట్వీట్‌ చేసింది. ఇక అడిడాస్‌ రాకతో మెటావర్స్‌పై వర్క్‌ చేస్తున్న ఫేస్‌బుక్‌కు పోటీ పెరగనుంది. ఇప్పటికే మైక్రోసాప్ట్‌, గూగుల్‌, ఆలిబాబా వంటి సంస్థలు మెటావర్స్‌పై పనిచేస‍్తుండగా..ఆ కంపెనీల బాటలో అడిడాస్‌ చేరినట్లైంది. 
 
శాండ్‌బాక్స్
శాండ్‌బాక్స్ ప్లే టు ఎర్న్ బ్లాక్‌చెయిన్ గేమ్. డిజిటల్ ఆస్తులను కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి అనుమతిస్తుంది. శాండ్‌ యుటిలిటీ టోకెన్ ప్లాట్‌ఫారమ్‌లో లావాదేవీలను సులభతరం చేస్తుంది. కాగా ఏడాది నుంచి ఇప్పటి వరకు శాండ్‌ బాక్స్‌ వ్యాల్యూ 15,000శాతానికి పైగా పుంజుకుంది. దీంతో మార్కెట్‌ క్యాపిటల్‌ వ్యాల్యూ  $4.8 బిలియన్లకు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు