2026 కల్లా రూ. 21,000 కోట్లకు..

6 Sep, 2022 06:15 IST|Sakshi

ఆదాయంపై ఏబీ ఫ్యాషన్‌ టార్గెట్‌

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌(ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌) రానున్న నాలుగేళ్లలో టర్నోవర్‌ను భారీగా పెంచుకునే ప్రణాళికల్లో ఉంది. 2026కల్లా రూ. 21,000 కోట్ల ఆదాయం సాధించగలమని విశ్వసిస్తున్నట్లు కంపెనీ చైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా పేర్కొన్నారు. మార్కెట్లో కంపెనీకిగల పొజిషన్‌ను మరింత పటిష్ట పరచుకోవడం ద్వారా లక్ష్యాన్ని సాధించగలమని కంపెనీ 15వ వార్షిక సాధారణ సమావేశం సందర్భంగా వాటాదారులకు తెలియజేశారు.

టెక్నాలజీ వినియోగం, ఎగ్జిక్యూషన్‌ సామర్థ్యాలతో లాభదాయక, ఫ్యూచర్‌ రెడీ బ్రాండ్‌ పోర్ట్‌ఫోలియోను నిర్మించనున్నట్లు వివరించారు. 2021 మార్చిలోనే రూ. 21,000 కోట్ల టర్నోవర్‌ను అంచనా వేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2026కల్లా అంచనాలను అధిగమించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరిన్ని మైలురాళ్లను అందుకునే లక్ష్యాలను ఏర్పాటు చేసుకోనున్నట్లు చెప్పారు. మార్చితో ముగిసిన గతేడాది(2021–22) కంపెనీ 55 శాతం వృద్ధితో రూ. 8,136 కోట్ల ఆదాయం సాధించింది.

మరిన్ని వార్తలు