హోల్సిమ్‌ ఇండియా కొనుగోలు రేసులోకి బిర్లా

12 May, 2022 08:09 IST|Sakshi

అల్ట్రాటెక్‌ ద్వారా కొనుగోలుకు బిడ్‌ 

ముంబై/న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూపు సైతం స్విస్‌ కంపెనీ హోల్సిమ్‌కు చెందిన అంబుజా సిమెంట్, ఏసీసీ ఆస్తుల కొనుగోలు రేసులోకి అడుగు పెట్టింది. బిర్లా అధికారికంగా బిడ్‌ వేసిందని, గ్రూపు కంపెనీ అల్ట్రాటెక్‌ ద్వారా కొనుగోలు చేయనున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు తెలిపాయి. సీసీఐ అనుమతి పొందుతామన్న నమ్మకం తమకు ఉందని, కొన్ని కంపెనీల ఆస్తులను వేరు చేయడానికి కూడా సిద్ధమేనని స్పష్టం చేశాయి. 

అల్ట్రాటెక్‌కు దేశ సిమెంట్‌ రంగంలో గణనీయమైన వాటా ఉండడం తెలిసిందే. పోటీ సంస్థలైన ఏసీసీ, అంబుజా సిమెంట్‌ ఆస్తులు కూడా అల్ట్రాటెక్‌ చేతికి వెళితే గుత్తాధిపత్యానికి దారితీస్తుందా? లేదా అన్నది సీసీఐ సమీక్షించే అవకాశం నేపథ్యంలో ఇలా తెలిపాయి. ఇప్పటికే జీఎస్‌డబ్ల్యూ గ్రూపు, అదానీ గ్రూపు సైతం హోల్సిమ్‌కు చెందిన అంబుజా సిమెంట్, ఏసీసీ ఆస్తుల పట్ల ఆసక్తిగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. స్టీల్‌ దిగ్గజం ఆర్సెలర్‌ మిట్టల్‌ కూడా ఆసక్తిగా ఉందని, రేసులోకి చేరొచ్చని విశ్వసనీయ వర్గాలు తె లిపాయి. ]

చదవండి: ఉక్రెయిన్‌ సంక్షోభం.. ఎగుమతుల్లో ఇండియా రికార్డ్‌!
 

మరిన్ని వార్తలు