ఆదిత్య బిర్లా ఏఎంసీ ఐపీవోకు సై

10 Aug, 2021 01:52 IST|Sakshi

సెబీ నుంచి అనుమతులు

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ సంస్థ ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఏఎంసీ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా అనుమతించింది. ఐపీవోలో భాగంగా కంపెనీ ఈక్విటీలో 13.5 శాతం వాటాకు సమానమైన 3.88 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ప్రమోటర్‌ సంస్థలు ఏబీ క్యాపిటల్‌ 28.51 లక్షలు, సన్‌ లైఫ్‌ (ఇండియా) ఏఎంసీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ 3.6 కోట్లు చొప్పున ఈక్విటీ  షేర్లను ఆఫర్‌ చేయనున్నాయి. పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా ఆస్తుల నిర్వహణ జేవీ.. ఏబీ సన్‌ లైఫ్‌ ఏఎంసీ ఏప్రిల్‌లోనే సెబీకి దరఖాస్తు చేసింది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 1,500–2,000 కోట్లు సమకూర్చుకోవచ్చని మార్కెట్‌ నిపుణుల అంచనా. ఇప్పటికే ఏఎంసీలు.. నిప్పన్‌ లైఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, యూటీఐ  లిస్టింగ్‌ సాధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు