హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మాజీ సీఈవోకు డెలాయిట్‌లో కీలక పదవి

4 Oct, 2023 14:19 IST|Sakshi

ప్రముఖ బ్యాంకర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఆదిత్య పూరి (Aditya Puri)కి ప్రముఖ ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ నెట్‌వర్క్‌ డెలాయిట్‌ (Deloitte) కీలక పదవి ఇచ్చింది. కంపెనీ సీనియర్ సలహాదారుగా నియమించినట్లు ప్రకటించింది.  

ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి బిజినెస్‌ లీడర్లలో ఒకరిగా పేరుపొందిన ఆదిత్య పూరి 1994లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సీఈవోగా నియమితులయ్యారు. సంస్థలో 26 సంవత్సరాలపాలు సేవలందించారు. 2020లో పదవీ విరమణ చేశారు.  

ప్రపంచంలో అతిపెద్ద ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ సంస్థ అయిన డెలాయిట్‌లో చేరినందుకు సంతోషిస్తున్నానని ఆదిత్య పూరి పేర్కొన్నారు. విశేష అనుభవం, దూరదృష్టి గల ఆదిత్యపూరి నియామకంపై డెలాయిట్ సౌత్ ఏషియా సీఈఓ రోమల్ శెట్టి సంతోషం వ్యక్తం చేశారు.

అంతకు ముందు జూన్‌లో భారతి ఎయిర్‌టెల్, సాఫ్ట్‌బ్యాంక్ ఇండియా మాజీ సీఈవో మనోజ్ కోహ్లీని సీనియర్ సలహాదారుగా డెలాయిట్ నియమించుకుంది.

మరిన్ని వార్తలు