వ్యాక్సిన్‌ వేసుకోకుంటే జీతం కట్‌! ఆ కంపెనీ సంచలన నిర్ణయం

23 Oct, 2021 17:04 IST|Sakshi

కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ భయాలు ప్రపంచాన్ని చుట్టు ముడుతుంటే ఇంకా కొందరు వ్యాక్సిన్‌ వేసుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తూ కాలయాపన చేస్తున్నారు. హేతుబద్దమైన కారణాలు లేకుండానే టీకా తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఇటువంటి వారికి  ఝలక్‌ ఇచ్చింది అమెరికాకు చెందిన మల్టీ నేషనల్‌ కంపెనీ అడోబ్‌.

కం‍ప్యూటర్‌తో పరిచయం ఉన్న వారికి, ఫోటోగ్రఫీ అంటే ఇంట్రస్ట్‌ ఉన్న వారికి అడోబ్‌ గురించి పరిచయం చేయక్కర్లేదు. ఫోటో, వీడియో ఎడిటింగ్‌కి సంబంధించి అనేక సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులను అందించే ఆ సంస్థకు అనేక దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. తమ కంపెనీ ఉద్యోగులందరూ వ్యాక్సిన్లు వేసుకోవాల్సిందే అంటూ ఇప్పటికే పలు మార్లు అడోబ్‌ కోరింది.

జీతం కట్‌
యాజమాన్యం విజ్ఞప్తిని కొందరు అడోబ్‌ ఉద్యోగులు పెడ చెవిన పెడుతున్నారు. లాజికల్‌ రీజన్స్‌ లేకుండానే వ్యాక్సిన్‌ తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. దీంతో ఇలాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని అడోబ్‌ నిర్ణయించుకుంది. డిసెంబరు 8వ తేదిలోగా వ్యాక్సిన్‌ తీసుకోని ఉద్యోగులను ఆన్‌ పెయిడ్‌ లీవ్‌ కింద పరిగణిస్తామని హెచ్చరించింది. 

మొదట ఇక్కడ
వ్యాక్సిన్‌ తీసుకోని ఉద్యోగులు పని చేసినా, లీవు పెట్టినా వారికి జీతం చెల్లించమని స్పష్టం చేసింది. ముందుగా ఈ నిబంధనను అమెరికాలోని ఉద్యోగులకు వర్తింప చేస్తామని అడోబ్‌ ప్రకటించింది. దశల వారీగా ఈ విధానం మిగిలిన దేశాల్లో ఉద్యగులకు విస్తరింప చేయనుంది.  

మినహాయింపు
వ్యాక్సినేషన్‌కి సంబంధించిన కఠిన నిబంధనల నుంచి కొద్ది మందికి మినహాయింపు ఇచ్చింద అడోబ్‌ సంస్థ. ఆరోగ్యపరమై కారణాలు, మత పరమైన నమ్మకాలు ఉన్న వారు వ్యాక్సినేషన్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ రెండు కేటగిరీలలోకి రాని అడోబ్‌ ఉద్యోగులందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సిందే.

చదవండి : వర్క్‌ఫ్రం హోమ్‌ ఓల్డ్‌ మెథడ్‌... కొత్తగా ఫ్లెక్సిబుల్‌ వర్క్‌వీక్‌

మరిన్ని వార్తలు