అడ్వాన్స్‌డ్‌ ఎంజైమ్‌- సిప్లా.. భళిరా భళి

25 Sep, 2020 14:22 IST|Sakshi

కంపెనీలో నలందా ఇండియా ఈక్విటీ వాటా కొనుగోలు

16 శాతం దూసుకెళ్లిన అడ్వాన్స్‌డ్‌ ఎంజైమ్‌

తొలుత 52 వారాల  గరిష్టాన్ని తాకిన షేరు

మల్టిపుల్‌ స్కెరోసిస్‌ ఔషధానికి యూఎస్‌ఎఫ్‌డీఏ ఓకే

5 శాతం జంప్‌చేసిన సిప్లా లిమిటెడ్‌ షేరు

ట్రేడర్ల షార్ట్‌ కవరింగ్, వరుస నష్టాల కారణంగా దిగివచ్చిన బ్లూచిప్స్‌లో ఇన్వెస్టర్ల కొనుగోళ్ల ఫలితంగా దేశీ స్టాక్‌ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 600 పాయింట్లు జంప్‌చేసి 37,150ను అధిగమించగా.. నిఫ్టీ 185 పాయింట్లు ఎగసి 10,990 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్‌ దాదాపు 4 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో హెల్త్‌కేర్ రంగ కంపెనీ అడ్వాన్స్‌డ్ ఎంజైమ్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. మరోవైపు మల్టిపుల్‌ స్కెరోసిస్‌ వ్యాధి చికిత్సకు వినియోగించగల ఔషధానికి యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతి లభించినట్లు పేర్కొనడంతో ఫార్మా దిగ్గజం సిప్లా లిమిటెడ్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

అడ్వాన్స్‌డ్‌ ఎంజైమ్‌ టెక్నాలజీస్‌
ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా నలందా ఇండియా ఈక్విటీ ఫండ్‌ 3.75 శాతం వాటాకు సమానమైన అడ్వాన్స్‌డ్ ఎంజైమ్‌ కంపెనీ షేర్లను కొనుగోలు చేసినట్లు ఎన్‌ఎస్‌ఈ బల్క్‌డేటా వెల్లడించింది. షేరుకి రూ. 263.80 ధరలో అడ్వాన్స్‌డ్‌ ఎంజైమ్‌కు చెందిన 4.19 మిలియన్‌ ఈక్విటీ షేర్లను నలందా కొనుగోలు చేసింది. ఇందుకు నలందా ఇండియా రూ. 111 కోట్లు వెచ్చించింది. దీంతో అడ్వాన్స్‌డ్ ఎంజైమ్‌ షేరు జోరందుకుంది. ఎన్‌ఎస్ఈలో తొలుత ఈ షేరు 16 శాతం దూసుకెళ్లి రూ. 317ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 11 శాతం జంప్‌చేసి రూ. 303 వద్ద ట్రేడవుతోంది. 

సిప్లా లిమిటెడ్‌
మల్టిపుల్‌ స్కెరోసిస్‌ వ్యాధి చికిత్సకు వినియోగించగల ఔషధానికి యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించినట్లు సిప్లా లిమిటెడ్‌ వెల్లడించింది. ఇది బయోజెన్స్‌ టెక్‌ఫిడెరా ఔషధానికి జనరిక్‌ వెర్షన్‌గా పేర్కొంది. డైమెథల్‌ ఫ్యూమరేట్‌ డీఆర్‌ క్యాప్సూల్స్‌గా పిలిచే వీటిని 120 ఎంజీ, 240 ఎంజీ డోసేజీలలో విక్రయించనున్నట్లు తెలియజేసింది. ఈ ఔషధానికి 3.8 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 28,000 కోట్లు) మార్కెట్‌ ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో సిప్లా షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 4.3 శాతం జంప్‌చేసి రూ. 765 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 773 వరకూ ఎగసింది. తద్వారా 52 వారాల గరిష్టం రూ. 819కు చేరువకావడం గమనార్హం! 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా