Afghanistan Currency: భారీగా పడిపోయిన అఫ్గాన్‌ కరెన్సీ విలువ

18 Aug, 2021 18:32 IST|Sakshi

తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించుకోవడంతో ఆ దేశ కరెన్సీ ఒక్కసారిగా భారీగా పడిపోయింది. దేశ అధ్యక్షుడు, తాత్కాలిక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ పారిపోవడంతో పెట్టుబడిదారులు కూడా ఆ దేశం నుంచి వెళ్లడానికి సిద్దం అవుతున్నారు. దీంతో అఫ్గనిస్తాన్‌ కరెన్సీ విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. బ్లూమ్ బెర్గ్ విడుదల చేసిన డేటా ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ విలువ నేడు 4.6% పడిపోయి 86.0625కు చేరుకుంది. తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకున్న రోజు నుంచి వరుసగా నాల్గవ రోజు కరెన్సీ విలువ క్షీణించింది. 

అఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో వేలాది మంది ప్రజలు ఆ దేశం నుంచి బయటకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తాలిబన్లను ఎదుర్కోకుండా దేశాన్ని విడిచిపెట్టి పోవడంతోనే ఈ గందరగోళం ఏర్పడినట్లు అజ్మల్ అహ్మదీ పేర్కొన్నాడు. ప్రస్తుతం "కరెన్సీ విలువ 81 నుంచి దాదాపు 100కు పెరిగి తర్వాత 86కు చేరుకున్నట్లు" అని రాశాడు.

అయితే, తాజాగా తాలిబన్లకు అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. తాలిబన్ల దూకుడుకు అమెరికా జో బైడెన్‌ సర్కార్‌ బ్రేకులు వేసింది. తాలిబన్లకు నిధులు దక్కకుండా స్తంభింప చేసింది. అమెరికా బ్యాంకుల్లోని అఫ్గన్‌కు సంబంధించిన నిధులను ఫ్రీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది.

మరిన్ని వార్తలు