Kaisa Group: కదులుతున్న చైనా పునాదులు, రియాలిటీ రంగంలో మరో దెబ్బ

6 Nov, 2021 17:35 IST|Sakshi

చైనా ఆర్ధిక మూలాలు ఒక్కొక్కటిగా దెబ్బతింటున్నాయి. ముంచుకొచ్చిన వరదలు, ఆహారం సంక్షోభం, ఇతర దేశాలు చైనాపై విధించిన వ్యాపారపరమైన ఆంక్షలు, పేట్రోగిపోతున్న కరోనాతో పాటు రియాలీ రంగంలో తలెత్తిన సంక్షోభం ఆ దేశ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. డ్రాగన్‌ కంట్రీ జీడీపీలో 29శాతంగా ఉన్న రియాలటీ రంగం కుదేలవుతుంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలో చైనాలో అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా ఉన్న ఎవర్ గ్రాండ్‌ డీఫాల్టర్‌ జాబితాలో చేరింది. తాజాగా మరొక రియల్ ఎస్టేట్ డెవలపర్ కైసా గ్రూప్ డిఫాల్టర్‌గా మిగిలిపోనున్నట్లు కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ తాజా పరిణామాలతో చైనా పునాదులు కదిలిపోతున్నాయని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. రియాలిటీ రంగంలో ఒడిదుడుకులు చూస్తుంటే అవి నిజమనిపిస్తున్నాయి.  

కైసా గ్రూప్‌


చైనాలో రియాల‍్టీ రంగానికి దెబ్బమీద దెబ్బపడుతున్నట్ల మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎవర్‌ గ్రాండ్‌ తర్వాత కైసా గ్రూప్‌ డీఫాల్టర్‌ జాబితాలో చేరడం చైనా ఆర్ధిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరిగింది. షెన్‌జెన్‌కు చెందిన రియాలిటీ కంపెనీ కైసా గ్రూప్ షేర్లు హాంకాంగ్‌లో స్టాక్క్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ను నిలిపివేశాయి. అంతేకాదు కైసాకు అనుబంధంగా అనుబంధ సంస్థలు నిర్వహించే ట్రేడింగ్ సైతం నిలిచిపోయిందని సీఎన్‌ఎన్‌ తెలిపింది.  కైసా సస్పెన్షన్ కారణాలేంటో బహిర్గతం చేయకపోయినా.. ఆ కంపెనీకి ఆర్ధికపరమైన సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది.   

చైనా ప్రభుత్వ ఆర్థికరంగా చెందిన మీడియా సంస్థ సెక్యూరిటీస్ టైమ్స్.. కంపెనీ ఆర్ధిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటుందని, బకాయిలు చెల్లించలేకపోతుందని కథనాల్ని ప్రచురించింది. అయితే కైసా మాత్రం రియాలీ రంగంపై అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థలు ఇచ్చే క్రెడిట్‌ రేటింగ్‌ తగ్గించడం వల్ల సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. 

ఎవర్‌ గ్రాండ్‌, మోడరన్‌ ల్యాండ్‌ 


చైనా రియల్ ఎస్టేట్ రంగంలో అతిపెద్ద సంస్థ ఎవర్ గ్రాండే. ఈ కంపెనీ 280 నగరాల్లో 1300 ప్రాజెక్టులను చేపట్టింది. 15 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ కంపెనీ దివాళా తీసిసింది. ప్రపంచవ్యాప్తంగా 300 బిలియన్ డాలర్లమేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ సంస్థ జారీ చేసిన వివిధ బాండ్లపై సెప్టెంబర్ 23 వ తేదీకి 80 మిలియన్ డాలర్ల వడ్డీని చెల్లించాల్సి ఉంది. కానీ ఆ అప్పులు చెల్లించలేక డీఫాల్టర్‌ జాబితాలో చేరింది. ఎంతలా అంటే  ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఉద్యోగులుకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాల్లో పేర్కొంది.

ఇప్పుడు కైసా గ్రూఫ్‌ సైతం డీఫాల్టర్‌ జాబితాలో చేరనుండగా.. మరో రియాలిటీ సంస్థ మోడరన్ ల్యాండ్ సైతం  తన అప్పులు చెల్లించలేక ఇబ్బంది పడుతోంది. ఇటీవల చైనా రియాలిటీ రంగంలో జరుగుతున్న పరిణామాలపై డెవలపర్లు కంపెనీ చెల్లించాల్సిన బకాయిల గురించి కంపెనీపై ఒత్తిడి తెచ్చారు. దీంతో మోడరన్‌ ల్యాండ్‌ ప్రతినిధులు బకాయిలు చెల్లించేందుకు తమకు మరింత సమయం కావాలని కోరారు. కోరిన గడువులోపు బకాయిలు చెల్లిస్తే సరేసరి. లేదంటే మోడరన్‌ ల్యాండ్‌ సైతం డీఫాల్టర్‌ జాబితాలో చేర్చాల్సి ఉంటుంది. 

చదవండి: చైనాకు మరో భారీషాక్‌, డ్రాగన్‌ను వదిలేస్తున్న టెక్‌ దిగ్గజ కంపెనీలు

మరిన్ని వార్తలు