మెగా డీల్‌ జోష్‌: ఎయిరిండియాలో ఉద్యోగాలు, పైలట్‌కు జీతం ఎంతంటే?

21 Feb, 2023 16:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,ముంబై: టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా ఎయిర్‌బస్, బోయింగ్‌ 470 విమానాలు కోనుగోలు తరువాత 2 లక్షలకు పైగ ఉద్యోగావకాశాలు లభించ నున్నాయంటూ  ఇప్పటికే పలువురు నిపుణులు అంచనాలు వేశారు. ఈ నేపథ్యంలో ఎయిరిండియాలో నియామకాల జోష్‌ కని పిస్తోంది.  కంపెనీ వెబ్‌సైట్‌లోని ఓపెనింగ్స్‌  ప్రకటన  మేరకు పైలట్లకు  ఏడాదికి రూ.2 కోట్ల  వరకు చెల్లించనుంది.

బోయింగ్, ఎయిర్‌బస్  విమానలు  డెలివరీకి సిద్ధంగాఉన్న నేపథ్యంలో నియామకాల  ప్రక్రియను ప్రారంభించింది. ఎయిరిండియాలో ఎయిర్‌లైన్ 'B777 కెప్టెన్ల' కోసం వెతుకుతోందని, వీరికి సంవత్సరానికి రూ. 2 కోట్లకు పైగా చెల్లించనుందని బిజినెస్‌ టుడే నివేదించింది. "B737 NG/MAX రకం రేటింగ్ ఉన్న పైలట్‌ల నుండి B777 ఫ్లీట్ కోసం ఫస్ట్ ఆఫీసర్స్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఎయిరిండియా వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఆసక్తిగల అభ్యర్థులకు నెలవారీగా 21 వేల డాలర్లు వేతనం.  అంటే వార్షిక ప్రాతిపదికన, రూ.2,08,69,416 పైమాటే. దీంతోపాటు క్యాబిన్ సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్, సెక్యూరిటీ, ఇతర  సిబ్బంది సహా అనేక ఓపెనింగ్‌లను ప్రకటించింది. 

నిపుణులైన పైలట్‌లు లేకపోవడం వల్ల ఈ పాత్ర చాలా ఎక్కువ జీతాన్ని ఆఫర్‌ చేస్తోంది.  ఎయిర్‌లైన్‌ కన్సల్టింగ్‌ సంస్థ మార్టిన్ కన్సల్టింగ్ సీఈవో మార్క్ మార్టిన్ వాదించారు. ప్రపంచవ్యాప్తంగా పైలట్ కొరత  ఉందనీ, నిర్దిష్ట విమానంలో కనీసం 5000 నుండి 7000 గంటల పాటు క్వాలిఫైడ్ పైలట్‌లకు చాలా డిమాండ్‌ ఉందన్నారు. ఎయిరిండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేంద్ర భార్గవ అభిప్రాయం  ప్రకారం ప్రతి విమానానికి కనీసం 10 మంది పైలట్లు అవసరం, వారి షిఫ్ట్ మారుతూ ఉంటుంది కాబట్టి. అలాగే  ప్రతి విమానానికి 50 కంటే తక్కువ క్యాబిన్ సిబ్బంది అవసరం. వీరితోపాటు చెక్‌అవుట్ కౌంటర్‌లో, బ్యాగేజీ హ్యాండ్లర్లు, మెయింటెనెన్స్ ఇంజనీర్లు మొదలైన సిబ్బంది కూడా అవసరమే.
 

మరిన్ని వార్తలు