టాటా చేతికి ఎయిరిండియా..! భారీ డీల్‌కు సిద్ధమైన యూరప్‌ కంపెనీ..!

21 Mar, 2022 19:35 IST|Sakshi

సుమారు డెబ్భై ఏళ్ల తర్వాత ఎయిరిండియాను టాటా సొంతం చేసుకుంది .  ప్రస్తుతం ఏవియేషన్‌ సెక్టార్‌లో ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా ఆధునీకరణ పనులకు సిద్దమైంది టాటా గ్రూప్స్‌. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్స్‌తో యూరప్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌ తయారీ సంస్థ ఎయిర్‌బస్‌ భారీ డీల్‌ను కుదుర్చుకునేందుకు ఊవిళ్లురుతుంది. 

టాటాతో పాటుగా..!
ఎయిర్‌బస్ తయారుచేస్తోన్న A350XWB విమానాల సేకరణకు సంబంధించిన డీల్‌ కోసం టాటా గ్రూప్స్‌తో పాటుగా పలు భారతీయ విమానయాన సంస్థలతో చర్చలను కంపెనీ జరుపుతోందని ఎయిర్‌బస్ ఇండియా & సౌత్ ఏషియా అధ్యక్షుడు రెమి మైలార్డ్ సోమవారం పేర్కొన్నారు. టాటా గ్రూప్స్‌తో దీర్ఘకాలిక, విశ్వసనీయమైన సంబంధాలను ఇరు కంపెనీల మధ్య నెలకొల్పేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. ఈ డీల్‌తో భారత విమాన రంగంలో కొత్త రికార్డులు నమోదుచేసే అవకాశం ఉందని రెమి మైలార్డ్‌ అభిప్రాయపడ్డారు. భారత డొమెస్టిక్‌ విమాన ప్రయాణాల్లో ఎయిర్ ట్రాఫిక్‌ వార్షిక సగటు వృద్ధి 6.2 శాతంగా, ప్రపంచ ఎయిర్‌ ట్రాఫిక్‌ సగటు వృద్ధి 3.9 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. ఇక టాటా గ్రూప్స్‌ ఇటీవలే ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా స్పెసిఫిక్, విస్తారా , ఎయిర్ ఏషియా ఇండియా అనే నాలుగు ఇండియన్ క్యారియర్‌లను నడుపుతోంది. 

A350XWB భారీ సైజులో..!
ఏవియేషన్‌ ఇండస్ట్రీలో ఎయిర్‌బస్‌ రూపొందించిన A350XWB ఎయిర్‌క్రాఫ్ట్‌ అత్యంత ఆదరణను పొందాయి. ఇవి అధిక ఫ్యుయల్‌ ట్యాంక్‌లను కల్గి ఉన్నాయి. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ A320NEO ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పోల్చితే  ఎక్కువ దూరం ప్రయాణించగలదు. ఈ విమానాలు ఏకధాటిగా 18 గంటలపాటు ప్రయాణిస్తాయి. 

చదవండి: అంబానీ మనవడా మజాకా.. 15 నెలలకే బడి బాట పట్టిన పృథ్వీ అంబానీ!

మరిన్ని వార్తలు