క్రిప్టోకరెన్సీ పై భారీగా ఇన్వెస్ట్‌ చేస్తోన్న భారతీయులు..!

28 Jun, 2021 11:32 IST|Sakshi

బంగారంపైనే కాకుండా క్రిప్టోకరెన్సీపై భారీగా పెట్టుబడులు

200 మిలియన్‌ డాలర్ల నుంచి దాదాపు 40 బిలియన్‌ డాలర్ల పెరుగుదల

క్రిప్టో కరెన్సీపై ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేస్తోన్న యువత..

మన దేశ సంస్కృతిలో బంగారం ఒక కీలకమైన వస్తువు. వివాహాది శుభ కార్యాల్లో కచ్చితంగా బంగారం ఉండాల్సిందే. మహిళలకు ఐతే మరీనూ.. బంగారం అంటే అమితమైన ప్రేమ. బంగారంపై భారతీయులకు ఉన్న మక్కువ గత ఏప్రిల్‌ , మే నెలలో జరిగిన బంగారం దిగుమతులే నిదర్శనం. ఓ వైపు కరోనా మహమ్మారితో సావాసం చేస్తోన్న బంగారం కొనుగోలు తగ్గడం లేదు. ఏప్రిల్‌, మే నెలలో సుమారు రూ. 51, 439 కోట్ల బంగారాన్ని భారత్‌ దిగుమతి చేసుకుంది. 

బంగారం నుంచి క్రిప్టోకరెన్సీ వైపు..
ప్రస్తుతం భారత ప్రజలు బంగారంపైనే కాకుండా క్రిప్టోకరెన్సీపై కూడా కన్నేశారు. భారత్‌లో సుమారు 25 వేల టన్నుల బంగారాన్ని కలిగి ఉంది. అంతే దూకుడుతో భారతీయులు క్రిప్టోకరెన్సీపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్‌, డాగ్‌కాయిన్‌, ఈథర్‌ క్రిప్టోకరెన్సీలపై విచ్చలవిడిగా ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది క్రిప్టో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి.

క్రిప్టోకరెన్సీపై పరిశోధనలు చేస్తోన్న ప్రముఖ సంస్థ చైనాలిసిస్‌ ప్రకారం భారత్‌లో  గత సంవత్సరంలో క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు 200 మిలియన్‌ డాలర్ల నుంచి దాదాపు 40 బిలియన్‌ డాలర్లుకు పెరిగిందని పేర్కొంది. ఇది రిజర్వ్‌ బ్యాంక్‌ క్రిప్టో కరెన్సీ పెట్టుబడులపై నిషేధం విధించిన కూడా భారీ ఎత్తులో భారతీయులు క్రిప్టో కరెన్సీపై ఇన్వెస్ట్‌ చేస్తున్నారు.

నేలచూపులు చూస్తోన్నా..తగ్గేది లేదు..!
క్రిప్టోకరెన్సీ గత కొన్ని నెలలుగా నేలచూపులు చూస్తున్న.. భారతీయులు డిజిటల్‌ కరెన్సీపై ఇన్వెస్ట్‌చేయడానికి మాత్రం జంకడం లేదు. బంగారంపై కాకుండా క్రిప్టో కరెన్సీపై ఇన్వెస్ట్‌ చేయడానికి భారతీయులు ముందుంటున్నారు. అంతేకాకుండా క్రిప్టో కరెన్సీపై ఇన్వెస్ట్‌మెంట్‌ అత్యంత పారదర్శకంగా ఉంటుందని నమ్ముతున్నారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను గడించవచ్చునని భావిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ కరెన్సీ ఆయా దేశాల్లోని సెంట్రల్‌ బ్యాంకుల నియంత్రిస్తాయి. కానీ క్రిప్టోకరెన్సీ విషయంలో అలా జరగదు. దాని నియంత్రణ పూర్తిగా కొనుగోలు, అమ్మకాలు జరిపే వారి చేతుల్లోనే ఉంటుంది. దీంతో భారతీయులు ఎక్కువగా క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్‌ చేస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. తాజాగా వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ నివేదిక ప్రకారం  భారత్‌లో ఎక్కువగా 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల యువతి, యువకులే ఎక్కువగా క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్‌ చేస్తున్నారని చైనాలసిస్‌ పేర్కొంది.  భారత్‌లో ప్రస్తుతం 19 క్రిప్టో ఎక్స్చేంజ్‌ మార్కెట్లు ఉన్నాయి.

చదవండి: Bitcoin: 2022 నాటికి రూ.1.85 కోట్లకు చేరనుందా..!

>
మరిన్ని వార్తలు