Sankarsh Chanda Story: నిండా పాతికేళ్లు కాలేదు రూ. 100 కోట్లు సంపాదన - అతనేం చేస్తున్నాడో తెలుసా?

2 May, 2023 10:33 IST|Sakshi

ఎవరైనా స్కూలుకెల్లే వయసులో అల్లరి చేస్తారు.. గేమ్స్ ఆడుకుంటారు. ఇవి తప్పా వేరే ఆలోచన కూడా సరిగ్గా ఉండదు. అయితే ఇలాంటి ఆలోచనలకు భిన్నంగా హైదరాబాద్‌కు చెందిన 'సంకర్ష్ చందా' (Sankarsh Chanda). కేవలం 17 ఏళ్ల వయసులోనే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి ఈ రోజు కోట్లు సంపాదిస్తున్నాడు.

సంకర్ష్ చందా హైదరాబాద్ ఏరియా ఇన్స్టిట్యూట్ లో డిప్లొమా పూర్తి చేసిన తరువాత 2016లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. రూ. 2000లతో ప్రారంభించి కేవలం రెండేళ్లలో అదనపు పెట్టుబడులు కూడా పెట్టాడు. ఒక సంవత్సరంలో తాను సుమారు రూ. 1.5 లక్షల పెట్టుబడి పెట్టానని, రెండు సంవత్సరాల్లో ఆ షేర్ల విలువ రూ. 13 లక్షలకు చేరిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

సంకర్ష్ చందా 2017లో నోయిడాలోని బెన్నెట్ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. ఆ సమయంలో తన చదువుకి స్వస్తి చెప్పి స్టాక్‌లు, బాండ్లు, ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడులకు సహాయం చేసే ఫిన్‌టెక్ బిజినెస్ స్టార్ట్ చేశారు. చదువు మానేసి తన మొత్తం దృష్టిని కేవలం దీనిపైనే నిమగ్నం చేశారు. సొంతంగా బిజినెస్ స్టార్ చేసినందుకు 2017లోనే తన 8 లక్షల షేర్లను విక్రయించాడు.

స్టార్టప్‌ల సంపాదించిన సొమ్మును మళ్ళీ పెట్టుబడిగా పెట్టాడు. ఆ తరువాత అతి తక్కువ కాలంలోనే భారీ లాభాలను గడించాడు. తన మొత్తం ఆస్తులు ఇప్పుడు రూ. 100 కోట్లు వరకు ఉంటుందని వెల్లడించినట్లు సమాచారం. ఇది మొత్తం తన మొత్తం స్టాక్ మార్కెట్ పెట్టుబడులతో పాటు కంపెనీ వ్యాల్యుయేషన్ మీద ఆధారపడి ఉంటుందని అంటున్నాడు. 

14 సంవత్సరాల వయసులో ఫాదర్ ఆఫ్ వ్యాల్యూ ఇన్వెస్టింగ్ అని పిలువబడే అమెరికన్ ఆర్థిక వేత్త బెంజిమన్ గ్రాహం కథనం చదివిన తర్వాత స్టాక్ మార్కెట్ మీద ఆసక్తి కలిగిందని, అప్పటి నుంచి ఎక్కువ పుస్తకాలు చదవడం, డబ్బు పట్ల మానవ ప్రవర్తన గురించి తెలుసుకోవడం ప్రారంభించినట్లు సంకర్ష్ చందా చెబుతున్నాడు.

(ఇదీ చదవండి: తక్కువ ధరలో లభించే 5జి స్మార్ట్‌ఫోన్స్ - ఇవి చాలా బెస్ట్..!)

తాను చదవడానికి కూడా పుస్తకాలను ఇతరుల వద్ద నుంచి లేదా లైబ్రరీ నుంచి తీసుకుంటానని చెప్పాడు. ఒకవేల నేను సొంతంగా పుస్తకాలను కొంటే వాటిని ఉంచడానికి కనీసం నాకు రెండు, మూడు గదులు కావాల్సి వస్తుంది. దానికి అదనపు డబ్బు కావాల్సి వస్తుంది. అందుకే బుక్స్ కొననని చెప్పాడు.

(ఇదీ చదవండి: ఒక్కసారిగా రూ. 171 తగ్గిన గ్యాస్ ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?)

బిగ్ బుల్ రాకేష్ ఝున్‌జున్‌వాలా అడుగుజాడల్లో నడుస్తూ.. చదువుకు స్వస్తి చెప్పి నిండా పాతికేళ్లు కూడా లేని సంకర్ష్ చందా ఏకంగా వంద కోట్లకంటే ఎక్కువ సంపాదించాడు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సలహాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.

మరిన్ని వార్తలు