దేహాత్‌ రూ.486 కోట్లు సమీకరణ

2 Dec, 2022 11:32 IST|Sakshi

న్యూఢిల్లీ: అగ్రిటెక్‌ స్టార్టప్‌ దేహాత్‌ రూ.486 కోట్ల నిధులను సమీకరించింది. సోఫినా వెంచర్స్, టెమసెక్‌తోపాటు ఇప్పటికే కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఆర్‌టీపీ గ్లోబల్‌ పార్ట్‌నర్స్, ప్రోసస్‌ వెంచర్స్, లైట్‌రాక్‌ ఇండియా ఈ మొత్తాన్ని సమకూర్చాయి.

కంపెనీ నిధులు సమీకరించడం గడిచిన రెండేళ్లలో ఇది మూడోసారి. 2012లో దేహాత్‌ ఏర్పాటైంది. 10,000లకు పైచిలుకు దేహాత్‌ సెంటర్స్‌ ద్వారా దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 15 లక్షల మంది రైతులను డిజిటల్‌ వేదికగా కొనుగోలుదార్లతో అనుసంధానించింది.

చదవండి: విప్రో చేతికి ప్రముఖ స్టార్టప్‌ కంపెనీ

మరిన్ని వార్తలు