CrickPe: ఫాంటసీ క్రికెట్ యాప్ ‘క్రిక్‌పే’ లాంచ్‌... అదీ ఐపీఎల్‌కు ముందు

24 Mar, 2023 10:56 IST|Sakshi

సాక్షి,ముంబై: భారత్‌పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ సరికొత్త  క్రికెట్ ఫాంటసీ స్పోర్ట్స్ యాప్ ‘క్రిక్‌పే’ని లాంచ్‌ చేశాడు. వచ్చే వారం ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నమెంట్‌కు ముందు ప్రపంచంలోని ఏకైక ఫాంటసీ క్రికెట్ యాప్  క్రిక్‌పేని ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది. 

క్రికెట్-ఫోకస్డ్ ఫాంటసీ స్పోర్ట్స్ యాప్‌ను ‘క్రిక్‌పే’ లాంచింగ్‌ను అష్నీర్ గ్రోవర్  ట్విటర్‌లో వెల్లడించారు. ఈ యాప్‌   గూగుల్ ప్లే స్టోర్ , యాపిల్ స్టోర్ డౌన్‌లోడ్ లింక్‌లను కూడా (తన అధికారిక ట్విట్టర్ మార్చి 23న)  హ్యాండిల్‌లో  షేర్ చేశారు. ఐపీఎల్‌  క్రికెట్‌లో అతిపెద్ద విప్లవం. కేవలం ఫాంటసీ గేమ్ ఆటతీరుతో క్రికెటర్లకు డబ్బు చెల్లిస్తుంది! మీరు గెలిస్తే..  క్రికెటర్ గెలుస్తాడు -క్రికెట్ గెలుస్తుంది !!" అని ట్వీట్‌చేశారు.

క్రిక్‌పే అనేది ఒక స్పెషల్‌ ఫాంటసీ క్రికెట్ గేమింగ్ యాప్. ఇక్కడ ప్రతిరోజూ 'క్రికెట్ గెలుస్తుంది'! ఇందులో ప్రతి మ్యాచ్‌లో, ఆడే క్రికెటర్లు, క్రికెట్ బాడీలు, నిజమైన జట్టు యజమానులు ఫాంటసీ గేమ్-విజేతలతో పాటు నగదు రివార్డులను గెలుచుకుంటారు  అని గూగుల్ ప్లే స్టోర్‌ వివరణ  ద్వారా తెలుస్తోంది.  అలాగే మనకిష్టమైన జట్లు,  ఇష్టమైన క్రికెటర్లందరిపై కూడా ప్రేమను (రివార్డులు) కురిపించవచ్చట.  

కాగా అష్నీర్ గ్రోవర్  తన వెంచర్ థర్డ్ యునికార్న్ ప్రైవేట్ లిమిటెడ్ కోసం సుమారు 4 మిలియన డాలర్ల సీడ్ ఫండింగ్‌ను సేకరించారు ఈ ఫండింగ్ రౌండ్‌లో అన్మోల్ సింగ్ జగ్గీ, అనిరుధ్ కేడియా, విశాల్ కేడియా, ఇతరులతో సహా రెండు డజన్ల ఏంజెల్ ఇన్వెస్టర్లు పాల్గొన్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు