AI Robot: గోడ కట్టేస్తున్న ఏఐ రోబోట్.. వీడియో వైరల్

27 Feb, 2024 11:36 IST|Sakshi

టెక్నాలజీ రోజురోజుకి పెరుగుతున్న తరుణంలో మనుషులతో ఎక్కువ అవసరం లేకుండా పోతోంది. ఇప్పటి వరకు టెక్ ప్రపంచంలో మాత్రమే సంచలనం సృష్టించిన ఏఐ ఇప్పుడు నిర్మాణ రంగంలోనూ తనదైన హవా చూపిస్తోంది. ఇందులో భాగంగానే గోడకట్టడానికి 'ఏఐ రోబోట్' వచ్చేసింది.

వీడియోలో గమనించినట్లయితే.. ఒక రోబోట్ తనకు తానుగానే ఇటుకలు తెచ్చుకోవడం, సిమెంట్ వేయడం, ఇటుకలు పేర్చడం వంటివి చూడవచ్చు. ఇందులో మానవ ప్రమేయం పెద్దగా లేకపోవడం కూడా గమనించవచ్చు.

నిజానికి ఒక గోడ కట్టాలంటే.. సిమెంట్ కలపడానికి, ఇటుకలు తీసుకురావడానికి, గోడలో ఇటుకలు పేర్చడానికి ఇలా చాలా మంది కావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కనిపించే రోబోట్ మాత్రం అన్ని పనులు తానే చేసుకుంటుంది, చేసుకుంటుంది. ఇలాంటి రోబోట్స్ వల్ల పని వేగం పెరుగుతుంది. నిర్మాణ కార్మికుల కోసం వెతుక్కోవాల్సిన లేదా ఎదురు చూడాల్సిన అవసరం లేదు.

ఇలాంటి రోబోట్స్ ఖరీదు ఒక్కో యూనిట్‌కు 25000 డాలర్లు ఖర్చు చేయాలి ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి రోబోట్స్ ఐరోపా దేశంలో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటువంటి రోబోట్స్ వల్ల పని పెరుగుతుంది, అదే సమయంలో నిర్మాణ కార్మికులకు పనిలేకుండా పోతుంది.

ఇదీ చదవండి: పక్కా ప్లాన్‌తో భారత్‌కు వస్తున్న అమెరికన్ కంపెనీ.. గట్టి పోటీకి సిద్ధం!

whatsapp channel

మరిన్ని వార్తలు