aidis: దక్షిణాది కుటుంబాలలో అప్పులే అధికం

29 Sep, 2021 07:56 IST|Sakshi

ముంబై: భారత్‌లో ఇతర ప్రాంతాలతో పోల్చితే దక్షిణాది ప్రాంతాల కుటుంబాల రుణ భారాలు అధికంగా ఉన్నట్లు ఇండియా రేటింగ్స్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. 2013 నుంచి 2019 వరకూ దేశంలోని కుటుంబాల రుణ భారాలపై ఆల్‌ ఇండియా డెట్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (ఏఐడీఐఎస్‌) నిర్వహించిన సర్వే గణాంకాలను ఈ సందర్భంగా ఇండి యా రేటింగ్స్‌ ఉటంకించింది.దక్షిణాదిలో అటు గ్రామీణ, ఇటు పట్టణ ప్రాంతాల కుటుంబాల రుణాలు దేశ ఇతర ప్రాంతాలతో పోల్చితే అధికంగా ఉన్నట్లు వివరించింది. 

2019 లో తెలంగాణ 67.2 శాతంతో గ్రామీణ కుటుంబాలలో అత్యధిక శాతం అప్పులు కలిగి ఉంది. ఈ విషయంలో నాగాలాండ్‌ 6.6 శాతంతో కనిష్ట స్థాయిలో ఉంది. ఇందుకు సంబంధించి పట్టణ ప్రాం తాల విషయంలో 47.8 శాతంతో కేరళ మొదటి స్థానంలో ఉంటే, మేఘాలయ 5.1 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ఇక తలసరి ఆదాయం విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకన్నా ముందున్నాయి.

ఆస్తులు–అప్పుల నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకలు తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. కోవిడ్‌ నేపథ్యంలో గృహ రుణాలు భారీగా పెరిగాయి. 2020–21 అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో గృహ రుణ భారం జీడీపీలో 37.9 శాతం ఉంది. 2019–20లో నాల్గవ త్రైమాసికంలో ఈ నిష్పత్తి 33.8 శాతంమే కావడం గమనార్హం.

చదవండి: ధనిక,పేదల మధ్య భారీ అంతరం

మరిన్ని వార్తలు