షార్జా-కొచ్చివిమానంలో లోపం: సేఫ్‌ ల్యాండింగ్‌

15 Jul, 2022 21:27 IST|Sakshi

ఎయిర్‌ అరేబియా విమానంలో లోపం,కొచ్చిలో సేఫ్‌ ల్యాండింగ్‌

కొచ్చి: జాతీయ, అంతర్జాతీయ,  విమానాల్లో  వరుసగా లోపాలు తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండ్‌  అవుతున్న ఘటనలు రోజుకొకటి  చోటు చేసుకుంటున్నాయి. 
తాజాగా షార్జా నుంచి కొచ్చి వస్తున్న ఎయిర్ అరేబియా విమానం(జి9-426) విమానం ల్యాండ్‌ అవుతుండగా సమస్య ఏర్పడింది. దీంతో విమానంలో ప్రయాణీకులు, సిబ్బంది గందర గోళానికి గురయ్యారు.

కొచ్చికి వస్తున్న ఎయిర్ అరేబియా విమానం (జి9-426)లో లోపం తలెత్తింది. యుఎఇలోని షార్జా నుండి ఈరోజు సాయంత్రం కొచ్చి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్నప్పుడు సమస్య తలెత్తింది. అయితే అదృష్టవశాత్తూ విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో విమానంలో ఉన్న మొత్తం 222 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది సురక్షితంగా ఉన్నారని కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ప్రకటించింది. హైడ్రాలిక్ వైఫల్యం కారణంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారని కొచ్చిన్ విమానాశ్రయంలో కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయని డీజీసీఏ తెలిపింది.

మరిన్ని వార్తలు