న్యూ ఇయర్ బంఫర్‌ ఆఫర్‌: రూ.1497కే ఎంచక్కా గాల్లో ఎగిరిపోండి!

25 Dec, 2022 08:59 IST|Sakshi

దేశంలో అతి పెద్ద విమానయాన సంస్థ ఎయిర్‌ ఏషియా(AirAsia) న్యూ ఇయర్‌ సందర్భంగా తన కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. రాబోతున్న కొత్త సంవత్సరాన్ని పుర​స్కరించుకుని 'న్యూ ఇయర్, న్యూ డీల్స్' పేరిట తమ ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను కేవలం రూ.1,497గా నిర్ణయించింది. ఈ  ఆఫర్‌ డిసెంబర్‌ 25 వరకు అమలులో ఉంటుందని, దీని కింద బుకింగ్‌ చేసుకున్న ప్యాసింజర్లు వచ్చే ఏడాది(2023) జనవరి 15 నుంచి ఏప్రిల్‌ 14 లోపు ప్రయాణించవచ్చని తెలిపింది.

ఈ ప్రత్యేక ఆఫర్‌ ధర బెంగళూరు-కొచ్చి వంటి రూట్‌లతో పాటు, దాని నెట్‌వర్క్ అంతటా ఇదే విధమైన తగ్గింపు విక్రయ ఛార్జీలు ఉన్నట్లు తెలిపింది. కంపెనీ వెబ్‌సైట్‌, కంపెనీ మొబైల్‌ యాప్‌, ఇతర ప్రధాన బుకింగ్ ఛానెల్‌ల ద్వారా బుకింగ్‌ చేసుకోవచ్చని సూచించింది. కొనసాగుతున్న లాయల్టీ ప్రయోజనాలలో భాగంగా, వెబ్‌సైట్, యాప్‌లో బుకింగ్ చేసే (నియో పాస్‌) NeuPass సభ్యులు కాంప్లిమెంటరీ ఫ్రూట్ ప్లాటర్,  ప్రాధాన్యత చెక్-ఇన్, బ్యాగేజీ, బోర్డింగ్‌తో పాటు 8 శాతం నియో కాయిన్స్‌ (NeuCoins) వరకు కూడా పొందుతారు. మరోవైపు, ప్రముఖ సంస్థ ఇండిగో కూడా రూ.2,023కే విమాన టిక్కెట్‌ను ఆఫర్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు