బిజినెస్‌ క్లాస్‌ ప్యాసింజర్‌కి షాక్‌, ట్వీట్‌ వైరల్‌: ఎయిరిండియా స్పందన

28 Feb, 2023 11:02 IST|Sakshi

సాక్షి,ముంబై: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా మరోసారి వివాదంలో చిక్కుకుంది.  ప్రముఖ షెఫ్‌ విమానంలో భోజనంపై మండిపడిన మరునాడే  విమానంలో అందించిన భోజనంలో పురుగు కనిపించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎయిరిండియా బిజినెస్ క్లాస్ విమానంలో తనకెదురైన అనుభవంపై ఓ ప్రయాణికుడు చేసిన ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. 

ముంబై నుంచి చెన్నైకి వెళ్తున్న బిజినెస్ క్లాస్ ప్యాసింజర్ మహావీర్ జైన్ ఎయిరిండియా  బిజినెస్ క్లాస్‌ విమానంలో వడ్డించిన  భోజనంలో పురుగు అంటూ ట్వీట్‌ చేశారు. దానికి సంబంధించిన  వీడియోను  కూడా షేర్‌ చేశారు. ఇంత అపరిశుభ్రమా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై టాటా యాజమాన్యంలోని క్యారియర్ స్పందిస్తూ,  కఠినమైన చర్యల తీసుకుంటామని పేర్కొంది.  

(ఇదీ చదవండి: ఎయిరిండియా మెగా డీల్‌: భారీ ఉద్యోగాలు, సీఈవో కీలక ప్రకటన)

కాగా మరొక సంఘటనలో నాగ్‌పూర్-ముంబై 0740 విమానంలో ప్రయాణించిన చెఫ్ సంజీవ్ కపూర్ కూడా విమానంలో వడ్డించే ఆహారంపై సంస్థపై మండిపడ్డారు. తనకు పుచ్చకాయ దోసకాయతో కూడిన కోల్డ్ చికెన్ టిక్కా,మినిస్క్యూల్ ఫిల్లింగ్‌తో కూడిన శాండ్‌విచ్, డెజర్ట్, షుగర్ సిరప్  అందించారని ఆరోపించారు. భారతీయులు అల్పాహారం ఇదా? 'వేక్ అప్ ఎయిరిండియా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అభిప్రాయం చాలా ముఖ్యమైంది అంటూ సంజీవ్‌ కపూర్‌ ట్వీట్‌పై  స్పందించిన ఎయిరిండియా  ఇకపై ఆన్‌బోర్డ్ ఫుడ్‌ మంచిగా ఉంటుందనే హామీని కూడా ఇచ్చింది. (టెస్లా జోష్‌: మస్త్‌..మస్...దూసుకొచ్చిన ఎలాన్‌ మస్క్‌)

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు