Air India-Boeing Deal: చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ఎయిర్ ఇండియా.. జో బైడెన్ ప్రశంసలు

16 Feb, 2023 10:25 IST|Sakshi

ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ 'బోయింగ్' నుండి ఏకంగా రెండు వందలకు పైగా విమానాలను కొనుగోలు చేయాలనే ఎయిర్ ఇండియా నిర్ణయాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ 'జో బైడెన్' మంగళవారం ప్రశంసించారు. ఈ నిర్ణయంతో తమ దేశంలో ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు తెలిపారు. ఈ ప్రకటన అమెరికా-ఇండియా ఆర్థిక భాగస్వామ్య బలాన్ని ప్రతిబింబిస్తుంది. 

ఎయిర్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా, భారత్ ఆర్థిక భాగస్వామ్యం యొక్క బలాన్ని ప్రతిబింబిస్తుందని జో బైడెన్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. దీనితో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి భారత్ - అమెరికా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి తాను ఎదురు చూస్తున్నట్లు కూడా తెలిపారు.

ఎయిర్ ఇండియా బోయింగ్ నుండి 34 బిలియన్ అమెరికన్ డాలర్లకు 220 విమానాలను కొనుగోలు చేయనుంది. మొత్తం మీద ఇది టాటా యాజమాన్యంలోని ఎయిర్‌లైన్స్, బోయింగ్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం అని స్పష్టంగా అర్థమవుతోంది. ఎయిర్ ఇండియా ఆర్డర్ డాలర్ విలువలో బోయింగ్‌కి మూడవ అతిపెద్ద విక్రయం మాత్రమే కాకుండా, విమానాల సంఖ్య పరంగా రెండవదిగా నిలుస్తుంది. రానున్న రోజుల్లో భారత్ - అమెరికా సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది అనటానికి ఇది ఒక ఉదాహరణ.

మరిన్ని వార్తలు