చైనాలో ఆంక్షలు..! వారికి ఆశాదీపంలా ఎయిరిండియా-టాటా డీల్‌..!

12 Oct, 2021 15:21 IST|Sakshi

ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియాను టాటా గ్రూప్‌ సన్స్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిరిండియాను బిడ్డింగ్‌లో టాటా గ్రూప్‌ రూ. 18,000 కోట్లకు దక్కించుకుంది. డిసెంబర్‌ చివరి నాటికి ఎయిరిండియా-టాటా మధ్య డీల్‌ పూర్తి అవుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎయిరిండియా డీల్‌ భారత మార్కెట్లకు సరికొత్త వేగాన్ని అందించింది. 

చైనాలో ఉక్కుపాదం...!
గత కొద్ది రోజులుగా పలు ప్రైవేట్‌ కంపెనీలపై చైనా ఉక్కుపాదం మోపుతోంది. ప్రపంచంలో అతి పెద్ద రెండో ఆర్థిక వ్యవస్థను కల్గిన చైనా తమ సొంత కంపెనీలపై జిన్‌పింగ్‌ ప్రభుత్వం భారీగా ఆంక్షలను పెడుతుంది. ఇతర దేశాల్లో పెట్టుబడులను నిలిపివేసేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఎవర్‌గ్రాండ్‌ సంక్షోభంతో..పలు ప్రైవేట్‌ కంపెనీలపై చైనా ప్రభుత్వం దృష్టిసారించింది. ఎవర్‌గ్రాండే గ్రూప్‌, రైడ్‌, హైలింగ్‌ దిగ్గజం దీదీ గ్లోబల్‌ ఇంక్‌ సంస్థలపై అక్కడి ప్రభుత్వం తనిఖీలను నిర్వహిస్తోంది. బ్యాంకులు, పెట్టుబడి నిధులు, ఫైనాన్షియల్‌ రెగ్యులేటర్లపై చైనా ఓ కన్నేసింది. 

ఎయిరిండియా-టాటా డీల్‌ సానుకూల పవనాలు..!
ఎయిరిండియా-టాటా డీల్‌ భారత మార్కెట్లకు సానుకూల పవనాలు వీచేలా కన్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణను వేగంగా చేస్తోంది. దీంతో ప్రైవేటు సంస్థలు ఆయా పీఎస్‌యూలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి. కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ ప్రైవేటు పెట్టుబడిదారులను గణనీయంగా ఆకర్షిస్తోంది.  భవిష్యత్తులో ఈక్విటీ మార్కెట్లలో స్థిరమైన వృద్ధి కన్పించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశ ఈక్విటీ ల్యాండ్‌స్కేప్‌ ప్రైవేటికరణతో మరిన్ని పెట్టుబడి ప్రవాహాలు, స్టాక్స్ భారీ లాభాలను గడిచే అవకాశాలు ఉన్నాయని స్మార్ట్‌సన్‌ క్యాపిటల్‌ ఫండ్‌ మేనేజర్‌ సుమీత్‌ రోహ్రా పేర్కొన్నారు. 

చైనాలో కొనసాగుతున్న రెగ్యులేటరీ క్లాంప్‌డౌన్‌తో భారత స్టాక్‌మార్కెట్లు, ఇతర ఐపీవో గ్లోబల్‌ ఇన్వెస్టర్లను ఆకర్షించాయి. రికార్డ్-తక్కువ వడ్డీ రేట్లు, రిటైల్-ఇన్వెస్టింగ్ బూమ్, టెక్ లిస్టింగ్‌ల కారణంగా, భారతదేశ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ ఏడాది 37శాతం పెరిగి 3.46 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బెర్గ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిరిండియా-టాటా ఒప్పందం దేశంలోని ప్రైవేట్ ఎంటర్‌ప్రైజ్‌లకు నియంత్రణ వాతావరణాన్ని మెరుగుపరచడానికి ఒక సంకేతం మాత్రమే కాదు, ప్రైవేట్ యజమానులను త్వరగా పొందాలనే అంచనాలపై ప్రభుత్వరంగ సంస్థల స్టాక్స్‌ విలువలను పెంచుతుందని రోహ్రా చెప్పారు.
చదవండి: వారెట్‌బఫెట్‌ ఆఫ్‌ ఇండియా లక్కు.. టాటా మోటార్స్‌తో భారీ సంపాదన

మరిన్ని వార్తలు