Air India: ఎయిరిండియా విస్తరణ ప్లాన్స్‌, చర్చనీయాంశంగా టాటా భారీ డీల్‌

10 Feb, 2023 15:49 IST|Sakshi

సాక్షి, ముంబై: టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా తన కార్యకలాపాలతో పాటు విమానాలను కూడా విస్తరిస్తోంది. తాజాగా అమెరికాకు చెందిన విమానాల తయారీదారు సంస్థ ఎయిర్‎బస్‎తో భారీ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. వచ్చేవారం ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. దాదాపు 250 విమానాల కోసం ఎయిర్‌బస్‌తో ఒప్పందం ఖరారైందని త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉందని పీటీఐ నివేదించింది. 

అలాగే ఇప్పటికే సుమారు 200 విమానాల కోసం బోయింగ్‌తో ఎయిర్‌లైన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు మీడియా నివేదికల ద్వారా  తెలుస్తోంది.   వచ్చేవారమే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంచనా. కొత్త విమానాల కోసం ఎయిర్‌లైన్ చారిత్రాత్మక ఆర్డర్‌ను ఖరారు చేయనున్నట్టు ఎయిరిండియా చీఫ్ క్యాప్ బెల్ విల్సన్  ఇటీవల (జనవరి 27న) వ్యాఖ్యానించారు.  దీంతో  కొనుగోలు వార్తలకు బలం చేకూరుతోంది. అయితే  ఒప్పందానికి సంబంధించి పూర్తి వివరాలు  వెల్లడి కాన కాని నేపథ్యంలోఎయిరిండియా అధికారిక ప్రకటన కోసం వెయిట్‌ చేయాల్సిందే.  

కాగా ప్రభుత్వ యాజమాన్యంలోని ఎయిరిండియా 16 సంవత్సరాల క్రితం కొత్త విమానాలను కొనుగోలు చేసింది. అప్పటి నుంచి 2005 వరకు ఒక్క విమానం కూడా కొనుగోలు చేయలేదు. చివరిసారిగా 111 విమానాల కోసం బోయింగ్ తో 68, ఎయిర్ బస్ తో 43 విమానాల కోసం 10.8బిలియన్ డాలర్ల భారీ డీల్ ను కదుర్చుకుంది ఎయిరిండియా.

మరిన్ని వార్తలు