ఎయిరిండియా మెగా డీల్‌: 2 లక్షలకు పైగా ఉద్యోగాలు

18 Feb, 2023 15:30 IST|Sakshi

సాక్షి,ముంబై:  ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా భావిస్తున్న  టాటా యాజమాన్యంలోని  ఎయిరిండియా మెగా డీల్‌ భారీ ఉద్యోగాల కల్పనకు దారి తీయనుంది.  ఇటీవల బోయింగ్‌,  ఎయిర్‌బస్ మధ్య తాజా మెగా ఒప్పందం భారతదేశంలో ప్రత్యక్షంగా  పరోక్షంగా  2 లక్షలకుపైగా ఉద్యోగాలను సృష్టిస్తుందని  విమానయాన రంగ నిపుణులు  భావిస్తున్నారు. ప్రస్తుతం 140 విమానాల సముదాయాన్ని కలిగి ఉన్న ఎయిరిండియా, బోయింగ్ ఎయిర్‌బస్  నుంచి భారగా విమానాలను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ  నేపథ్యంలో విమానాలు నడిపేందుకు,  క్రూ, ఇతర  ప్రత్యక్ష పరోక్ష సిబ్బంది అవసరం కాబట్టి భవిష్యత్తులో భారీగా ఉద్యోగాల కల్పిను అవకాశం లభిస్తుందని అంచనా.నారో బాడీ ఎయిర్‌క్రాఫ్ట్ కోసం మొత్తం ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు దాదాపు 400. వైడ్ బాడీ ప్లేన్ కోసం, 600-700మంది అవసరమంని తెలుస్తోంది. "డైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్‌లో నేరుగా విమానయాన సంస్థ ద్వారా ఉపాధి పొందుతున్న వారు ఉంటారు, ఉదాహరణకు, పైలట్లు, క్యాబిన్ సిబ్బంది,  టెక్నికల్‌,  నాన్-టెక్నికల్ సిబ్బంది. ఇది నారో బాడీ విమానానికి దాదాపు 175. ఇంకా విమానాశ్రయ సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌లు, ట్రావెల్‌ సేల్స్‌ ఏజెన్సీ, సర్వీస్ ప్రొవైడర్లు ఇవన్నీ కలిసి విమానానికి 400 ఉద్యోగులు అవసమరని ఏవియేషన్ రంగ మార్టిన్ కన్సల్టింగ్ సీఈవో మార్క్ మార్టిన్ బిజినెస్‌ టుడేతో చెప్పారు. ఈ విధంగా మొత్తంగా లెక్కిస్తే దాదాపు 2 లక్షల నుంచి 2 లక్షల 9వేల వరకు ఉంటాయని ఉద్యోగాలొస్తాయని ఆయన చెప్పారు. దీనికి తోడు ఎయిరిండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేందర్ భార్గవ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అయితే భారతదేశంలోనే కాకుండా అమెరికాలో కూడా ఉద్యోగాలొస్తాయని అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ ఈ బిల్‌పై స్పందించారు.  ఇది చారిత్రాత్మక ఒప్పందమనీ,  అమెరికాలో మిలియన్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని  కొనియాడారు. అంతేకాదు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ కూడా ఈ ఒప్పందాన్ని స్వాగతించారు, ఎందుకంటే ఇది వారికి కీలకమైనది.

మరిన్ని వార్తలు