రతన్‌ టాటా మరో సంచలనం..500 విమానాల కోసం భారీ ఆర్డరు!

12 Dec, 2022 17:23 IST|Sakshi

ఎయిరిండియాను ప్రపంచ స్థాయి ఎయిర్‌లైన్‌గా తీర్చిదిద్దేందుకు మాతృ సంస్థ టాటా గ్రూప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌బస్, బోయింగ్ ఈ రెండు సంస్థల నుంచి పదివేల బిలియన్ల డాలర్ల విలువైన 500 ప్యాసింజర్‌ విమానాలు కొనుగోలు చేసేందుకు ఆర్డర్‌ పెట్టినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

వాటి విలువ సుమారు రూ.80వేల కోట్లు ఉండనుందని అంచనా. ఆర్డర్‌ ఇచ్చిన వాటిలో 400 నారో బాడీ జెట్‌లు, 100 లేదా అంతకంటే ఎక్కువ వైడ్ బాడీ ఎయిర్‌ ​క్రాఫ్ట్‌లు ఉండగా.. డజన్ల కొద్దీ ఎయిర్‌బస్ ఏ350లు, బోయింగ్ 787లు, బోయింగ్‌  777లు ఉన్నాయి.  

అదే జరిగితే బిలియన్‌ డాలర్ల విమానాల కొనుగోలుతో  10 ఏళ్ల క్రితం అమెరికన్‌ ఎయిర్‌ లైన్‌ కొనుగోళ్లను టాటా అధిగమిస్తుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. దశాబ్ధం క్రితం అమెరికన్ ఎయిర్‌లైన్స్ 460 ఎయిర్‌బస్, బోయింగ్ జెట్‌ల ఆర్డర్‌ పెట్టింది.  

నారో బాడీ ఎయిర్‌ క్రాఫ్ట్‌, వైడ్‌ బాడీ విమానాల మధ్య వ్యత్యాసం


 

ట్యూబ్‌ షేప్‌లో విమానంలోని ప్యాసింజర్లకు కూర్చునే(మెయిన్‌ బాడీ), వెడల్పు పెద్దగా ఉండి..రో’ (అడ్డం)లో ఎక్కువ సీట్లు ఉంటే వైడ్‌ బాడీ ఎయిర్‌ క్రాఫ్ట్‌ అంటారు. 

ఉదాహారణకు ఈ వైడ్‌ బాడీ విమానం రౌండ్‌గా 5 నుంచి 6 మీటర్లు ఉండి..అడ్డంగా 9 సీట్లు ఉంటే ప్రతి మూడు సీట్ల మధ్య నడించేందుకు కాళీ ప్రదేశం ఉంటుంది. అలా 9 సీట్ల మధ్యలో ప్రయాణికులు నడించేందుకు రెండు దార్లు ఉంటాయి. ప్రతి మూడు ఈ విమానంలో 10..10 సీట్ల మధ్య ఖాళీగా ఉంటుంది. 

అదే నారో బాడీ ఎయిర్‌ క్రాఫ్ట్‌ బాడీ రౌండ్‌గా 3 నుంచి 4 మీటర్లు ఉండి.. అడ్డంగా 3 నుంచి 6  సీట్లు ఉంటాయి. ప్రతి మూడు సీట్ల మధ్య నడించేందుకు ఒక్క దారి మాత్రమే ఉంటుంది.

మరిన్ని వార్తలు