Air India Salaries: ఎయిరిండియా ఉద్యోగులకు టాటా గ్రూప్‌ శుభవార్త!

26 Aug, 2022 15:09 IST|Sakshi

ఉద్యోగులకు ఎయిరిండియా శుభవార్త చెప్పింది. టాటా గ్రూపులో భాగమైన ఎయిరిండియా సెప్టెంబర్‌1 నుంచి ఉద్యోగులకు కోవిడ్‌-19 ముందున్న శాలరీలను పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించింది. జీత భత్యాలతో పాటు ఉద్యోగుల తొలగింపు, అలవెన్సులు, భోజన సౌకర్యాలన్నింటిని సవరిస్తున్నట్లు చెప్పింది.  

దేశీయ విమానయాన రంగంపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపింది. కరోనా విజృంభణ, నమోదైన  కేసులు, ప‍్రయాణికులపై ఆయా దేశాల ఆంక్షల కారణంగా విమానాల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. అయితే ప్రస్తుతం కోవిడ్‌ పరిస్థితుల నుంచి కోలుకుని కోవిడ్ ముందు నాటి స్థాయికి తిరిగి వచ్చాయి. 

దీంతో కొన్ని ఏవియేషన్‌ సంస్థలు నష్టాలతో దివాళా తీశాయి. మరికొన్ని సంస్థలు ఛార్జీల్ని పెంచాయి. ఉద్యోగులకు చెల్లించే జీతాలతో పాటు, ఇతర సౌకర్యాల్ని పూర్తిగా తగ్గించాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఏవియేషన్‌ దిగ్గజం ఎయిర్‌ ఇండియా ఉద్యోగులకు చెల్లించే జీతాల్ని పునరుద్దరిస్తూ ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది.విమానయాన రంగం కోవిడ్‌ ముందు స్థాయికి చేరుకుంటుంది. అందుకే తగ్గించిన ఉద్యోగుల శాలరీలను పెంచే అంశంపై సమీక్షలు జరపడం సంతోషంగా ఉందని ఎయిరిండియా చెప్పిందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

చదవండి👉 ఎయిరిండియా కొత్త సీఈవోగా క్యాంప్‌బెల్ విల్సన్‌!

మరిన్ని వార్తలు