Airtel 5g: ఎయిర్‌టెల్‌ యూజర్లకు భారీ షాక్‌! ఈ ఫోన్‌లలో 5జీ పనిచేయడం లేదంట!

5 Oct, 2022 13:08 IST|Sakshi

4జీ కంటే 10 రెట్ల వేగంతో పనిచేసే 5జీ టెక్నాలజీ ఎప్పుడు అందుబాటులోకి వస‍్తుందా? అని ఎదురు చూసిన  స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లకు నిరాశ ఎదురైనట్లు తెలుస్తోంది.

అక్టోబర్‌ 1న ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ సదస్సు ప్రారంభం సందర్భంగా 5జీ సేవల్ని ప్రధాని అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం టెలికం సంస్థ ఎయిర్ టెల్‌ దేశంలో ఎంపిక చేసిన హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, వారణాసి, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, సిలిగురిలో  5జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది.

అయితే ఈ 5జీ సేవలు ఐఫోన్‌, శాంసంగ్‌, వన్‌ ప్లస్‌తో పాటు ఇతర స్మార్ట్‌ ఫోన్‌లలో పనిచేయడం లేదని యూజర్లు వాపోతున్నారు. దీనిపై నిపుణులు మాత్రం తయారీ సంస్థలు ఫోన్‌లలో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేయాలని అంటున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

5జీ పనిచేయడం లేదు 
5జీ నెట్‌ వర్క్‌ పనిచేయకపోవడంతో ఎయిర్‌టెల్‌, ఫోన్‌ తయారీ సంస‍్థలు టెస్టింగ్‌ నిర్వహిస్తుండగా..యాపిల్‌, శాంసంగ్‌ సిరీస్‌లోని ఫ్లిప్‌ 4, ఫోల్డ్‌ 4, ఎస్‌ 21 ఎఫ్‌ఈ, గెలాక్సీ ఎస్‌ 22, ఎస్‌22 ఆల్ట్రా అండ్‌ ఎస్‌ 22, వన్‌ ప్లస్‌కు చెందిన వన్‌ ప్లస్‌ 8, 8టీ, 8ప్రో, 9ఆర్‌, నార్డ్‌2, 9ఆర్టీలలో 5జీ పనిచేయడం లేదని, మిగిలిన స్మార్ట్‌ ఫోన్‌లలో ఈ ఫాస్టెస్ట్‌ టెక్నాలజీని వినియోగించుకోనే సౌలభ్యం ఉంది.          

చదవండి👉 రూ.15వేలకే ల్యాప్‌ట్యాప్‌,‘రిలయన్స్ జియో సరికొత్త సంచలనం!’

మరిన్ని వార్తలు