శాంసంగ్‌ స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లకు శుభవార్త!

25 Nov, 2022 20:26 IST|Sakshi

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ శాంసంగ్‌   వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఎయిర్‌టెల్‌ 5జీ సపోర్ట్‌ చేసేలా ఓవర్‌ ది ఎయిర్‌ (ఓటీఏ)ను అప్‌డేట్‌ చేసినట్లు తెలిపింది. దీంతో శాంసంగ్‌ 5జీ ఫోన్‌లలో ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ను వినియోగించేవారికి ఈ లేటెస్ట్‌ టెక్నాలజీ నెట్‌ వర్క్‌ అందుబాటులోకి రానుంది.  

ఎయిర్‌టెల్‌ సంస్థ దేశంలో 5జీ నెట్‌వర్క్‌ సేవల్ని అందుబాటులోకి తెస్తోంది. అయితే ఈ సేవల్ని వాడుకోవాలంటే ఫోన్‌లలో ఓటీఏ సదుపాయం తప్పని సరిగా ఉండాలి. అందుకే ఆయా స్మార్ట్‌ ఫోన్‌ సంస్థలు ఫోన్‌లలో ఓటీఏను అప్‌డేట్‌ చేస్తున్నాయి. తాజాగా శాంసంగ్‌ సంస‍్థకు చెందిన అన్ని ఫోన్‌లలో ఓఎస్‌ను అప్‌డేట్‌ చేసినట్లు తెలిపింది.     

కాగా, ఇటీవల ట్రాయ్‌ యూజర్ల డేటాను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం..టెలికం కనెక్షన్లలో జియో ఆధిపత్యం కొనసాగుతోంది. సెప్టెంబర్‌లో కంపెనీ కొత్త యూజర్ల సంఖ్య 7.2 లక్షలు పెరిగింది. 4.12 లక్షల కొత్త యూజర్లతో భారతీ ఎయిర్‌టెల్‌ రెండో స్థానంలో నిల్చింది. సంక్షోభంలో ఉన్న వొడాఫోన్‌ ఐడియా కనెక్షన్లు మాత్రం తగ్గుతూనే ఉన్నాయి. వొడాఫోన్ ఐడియా  సెప్టెంబర్‌లో  ఏకంగా  40 లక్షల యూజర్లను కోల్పోయింది. 21.75 శాతం మార్కెట్ వాటాతో మూడవ స్థానంలో నిలిచింది.

మరిన్ని వార్తలు